సినిమాసినిమా వార్తలు

Samantha Naga Chaitanya: సమంతతో విడాకులు.. విభేదాలు.. నాగచైతన్య ట్వీట్ తో క్లారిటీ

టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ కపుల్ జంట సమంత-నాగచైతన్యలదీ..తొలి చిత్రంతోనే ప్రేమలో పడ్డ ఈ జంట

Samantha Naga Chaitanya: Divorce Clarity With A Single Tweet

Samantha Naga Chaitanya: టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ కపుల్ జంట సమంత-నాగచైతన్యలదీ..తొలి చిత్రంతోనే ప్రేమలో పడ్డ ఈ జంట 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి అయ్యాక కూడా సమంత సినిమాలు ఆపకపోవడం.. పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది.

అయితే ఇటీవల సమంత తన ఇంటిపేరును ‘అక్కినేని’గా ట్విట్టర్ లో తొలగించడంతో వీరిమధ్య విభేదాలు తలెత్తాయా? అన్న ప్రచారం జోరుగా సాగింది. ఇక ఓ ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా.. ‘టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను’ అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో ఈ జంట విడిపోనుందని విడాకులు తీసుకోనుందని జోరుగా ప్రచారం సాగింది.

అయితే తాజాగా సెప్టెంబర్ 24న నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ మేరకు ఒక టీజర్ ను కూడా చిత్రం యూనిట్ నిన్న విడుదల చేసింది. దాన్ని అక్కినేని నాగచైతన్య షేర్ చేయగా.. అది అద్భుతంగా ఉందని చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతూ సమంత రీట్వీట్ చేసింది. దీనికి సాయిపల్లవి కూడా స్పందించింది. ‘థాంక్యూ సోమచ్ అంటూ’ రిప్లై ఇచ్చింది.

సమంత ఈ ట్వీట్ లో నాగచైతన్యను ట్యాగ్ చేయడంతో అతడు స్పందిస్తాడా? లేదా? అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపింది. వీరిద్దరి విభేదాలు ఉంటే స్పందించడు అని అంతా అనుకున్నారు. కానీ నాగచైతన్య ఆప్యాయంగానే స్పందించడం విశేషం.

భర్త చైతన్య సినిమా ట్రైలర్ బాగుందని సమంత చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దీనికి తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. ‘థాంక్యూ సామ్’ అంటూ సమంత ట్వీట్ ను షేర్ చేసి చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్దరి విభేదాలు, విడాకుల గురించి సాగుతున్న రూమర్స్ కు చెక్ పడినట్టైంది. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఒక్క ట్వీట్ తో వీరి బంధం ఇంకా బలంగానే ఉందన్న విషయం తెలిసివచ్చింది.

ట్వీట్ ఇదే..

Back to top button