తెలంగాణరాజకీయాలు

ఆదిలాబాద్ కోర్ట్ సంచలన తీర్పు.. సమత దోషులకు ఉరి

 

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత హత్యాచారం ఘటన సంచలనం సృష్టించినం సృష్టించిన విషయం తెలిసిందే..అయితే సమత అత్యాచారం చేసి హత్య చేసిన షేక్ బాబు (ఏ1), షాబుద్దీన్ (ఎ2), మఖ్దూం (ఏ3) దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. నవంబర్ 24 వ తేదీన సమతపై నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూంలు అత్యాచారం చేసి హత్య చేసారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ ప్రాంతం మొత్తం నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో దిశ ఘటన కూడా జరగడంతో ప్రభుత్వం, సమత కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.

ఈ కేసులో కోర్టు సాక్షులను విచారించి ఫైనల్ గా ఈరోజు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో సమత తరపు బంధువులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమత కేసులో న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ కేసు తరువాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని న్యాయవాదులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, నిర్భయ విషయంలో ఆలస్యం జరిగినట్టుగా జరగకుండా వీలైనంత త్వరగా వీరిని ఉరి తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు.