టాలీవుడ్సినిమా

అరివీర భయంకర.. అధీరా!


బహుబలి తర్వాత భారత సినీ పరిశ్రమలో అంతటి గొప్ప విజయం సాధించిన ప్రాంతీయ చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ పీరియాడికల్‌ మూవీ రెండేళ్ల కిందట సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. కన్నడనాట రూ. 200 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో డబ్‌ అయింది. అక్కడ అనేక రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఓవరాల్‌గా రూ.85 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 318 కోట్లు వసూల్‌ చేసి పాన్‌ ఇండియా మూవీగా నిలిచింది. హీరో యశ్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే, ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు అనేక అవార్డులు కూడా సొంతమయ్యాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌, స్టంట్స్‌ విభాగాల్లో నేషనల్‌ అవార్డులు వచ్చాయి.

Also Read: తగ్గాల్సిన టైమ్‌లో పెంచేసిన పూజా హెగ్డే!

ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించాడు. అప్పటి నుంచి సెకండ్‌ పార్ట్‌ కోసం కన్నడ వర్గాలే కాకుండా భారత సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇండియా మోస్ట్‌ అవైటింగ్‌గా మూవీగా మారింది. పైగా విలన్‌ ‘అధీరా’ పాత్రను బాలీవుడ్‌ స్టార్ సంజయ్‌ దత్‌ పోషిస్తుండడంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. అలాగే, అధీరా ఎవరు? ఎలా ఉంటాడు? అంటూ చాన్నాళ్ల నుంచే సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది చిత్ర బృందం. తాజాగా అధీరా ఫస్ట్ లుక్‌ విడుదల చేసింది. బుధవారం సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్‌ అధీరా ఫస్ట్ లుక్ విడుదల రిలీజ్‌ చేసింది.

Also Read: సోనూసుద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

అధీరా పాత్ర ఎంత భయంకరంగా ఉండబోతుందో ఫస్ట్‌లుక్‌తోనే హింట్‌ ఇచ్చింది. అత్యంత పాశవికంగా, జాలి, దయ లేని మనిషిగా అధీరా ఉంటాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదివరకే ప్రకటించాడు. అన్నట్టుగానే అరివీర భయంకరమైన లుక్‌లో సంజయ్‌ను ప్రజెంట్‌ చేశాడు. వైవిధ్యమైన హెయిర్ స్టైల్.. తల, ముఖంపై టాటూస్‌, చేతిలో పెద్ద కత్తిలో సంజయ్‌ దత్‌ లుక్‌ చూస్తేనే భయం పుట్టేలా ఉంది. తెల్లటి గడ్డం, మెలితిప్పిన మీసంతో సంజయ్‌ కత్తికి తలపెట్టి దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈ పోస్టర్ను తన ట్విట్టర్ఖాతాలో పోస్ట్‌ చేసిన డైరెక్టర్ నీల్ ‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. కేజీఎఫ్‌2లో భాగమైనందుకు థ్యాంక్స్‌. నెక్ట్స్‌ షెడ్యూల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశాడు. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్‌ రవీనా టండన్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. రవీ బస్రూర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్. హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో వారాహి సంస్థ విడుదల చేయనుంది. సెకండ్‌ చాప్టర్ కూడా కన్నడ, తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 23 రిలీజ్‌ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

https://twitter.com/prashanth_neel/status/1288330843073605634

Tags
Show More
Back to top button
Close
Close