అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

తెలుగురాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా నిమగ్నమయ్యారు. భోగిమంటల్లో ఇంట్లోని పాత వస్తువులు, చెక్కలు, అవసరం లేనివి వేసి ప్రజలు చలికాగారు. వాడవాడలా.. ఇంటింటా ఈ వేడుకలు సాగాయి.

Also Read: భోగి మంటలెందుకు? భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి? సంప్రదాయం వెనుక కథ

ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కృష్ణ జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐదు జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు.

హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన భోగి పండుగ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత.. తెలుగు రాష్ట్రాల ప్రజల భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

చార్మినార్ వద్ద సాంప్రదాయ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో సందడిగా మారింది. భోగి అంటేనే మన జీవితాల్లో ఉన్న చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలని జరుపుకుంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంతోపాటు దేశమంతా కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలుగాలని కోరుకుంటున్నానన్నారు.

ఇక ఏపీలో సంక్రాంతి సందర్భంగా సందడి నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కోస్తా జిల్లాల్లో కోడిపందేలా కోసం బరులు సిద్ధం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో నేతలు మద్దతు ఇవ్వడంతో పోలీసులు అటు వైపు వెళ్లకుండా యథేచ్ఛగా సాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button