ఓవర్సీస్ షో టైమింగ్స్సినిమాసినిమా రివ్యూస్

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

 

నటీనటులు: మహేశ్‌బాబు, రష్మిక, విజయశాంతి

దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

నిర్మాత: అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు

రేటింగ్:3/5

 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వరుస విజయ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ ఈ చిత్రం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. .మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

ఇక కథ లోకి వెళ్లినట్టయితే అజయ్ కృష్ణ (మహేష్ బాబు) భారత ఆర్మీలో మేజర్ గా పని చేస్తున్న నేపథ్యంలో జరిగిన ఒక ఊహించని పరిణామం రీత్యా ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ కు రావాల్సి వస్తుంది.ఈ ప్రక్రియలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం అవుతుంది.అలా పరిచయం అయిన రష్మిక కుటుంబానికి కర్నూల్ లో ఉన్న విజయశాంతికి ఏమన్నా సంబంధం ఉందా?విజయశాంతి (భారతి) మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఘర్షణ మొదలవ్వడానికి గల అసలు కారణం ఏమిటి? అసలు వీరిద్దరి మధ్య లోకి మహేష్ ఎందుకు వస్తాడు అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

పెర్ఫార్మన్స్:

చాలా రోజుల తర్వాత మహేశ్‌బాబుకు ఒక పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేసే అవకాశం లభించింది. ఆర్మీ అధికారిగా, భారతి కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించారు. మేజర్‌ అజయ్‌కృష్ణగా ఉన్నంతసేపు హుందాగా నటించిన ఆయన కర్నూలు బయలుదేరిన తర్వాత నుంచి ఇంకాస్త ఎనర్జిటిక్‌గా నటించారు. ‘పోకిరి’, ‘దూకుడు’ తర్వాత ఆ స్థాయి కామెడీ టైమింగ్‌తో అలరించారు. ముఖ్యంగా మహేశ్‌ డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌లు, యాక్షన్‌ అభిమానులను విశేషంగా అలరిస్తుంది.

 

ప్లస్ పాయింట్స్ :

మహేష్ మైండ్ బ్లాకింగ్ పెర్ఫామెన్స్

విజయశాంతి కీ రోల్

యాక్షన్ సన్నివేశాలు

ట్రైన్ కామెడీ ఎపిసోడ్

 

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం లేకపోవడం

ఉహిచగలిగే కథనం
క్లైమాక్స్

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మహేష్ మరియు అనీల్ ల కాంబోలో వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం తెలుగులో సంక్రాంతికి శుభారంభం,అభిమానులకు మరింత పెద్ద పండుగ తెచ్చి పెట్టిందని చెప్పాలి. కానీ రొటీన్ స్టోరీ మరియు ఊహించగలిగే కథనాలు మైనస్ అని చెప్పాలి.కాకపోతే అనీల్ టేకింగ్ మాత్రం వీటిని కవర్ చేసేస్తాయి.మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బొమ్మ దద్దరిల్లింది అని చెప్పాలి.

 

Sarileru Neekevvaru Movie Review

Back to top button