అత్యంత ప్రజాదరణవ్యాపారము

కొత్తకారు కొనేవాళ్లకు శుభవార్త.. రూ.3 లక్షల తగ్గింపు..?

ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన మహీంద్రా కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త కారును కొనుగోలు చేసేవాళ్లు ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. మహీంద్రా అల్టురాస్ జీ4 కారును కొనుగోలు చేయడం ద్వారా 3 లక్షల రూపాయల తగ్గింపును పొందే అవకాశాన్ని మహీంద్రా కంపెనీ కల్పిస్తోంది.

క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, అదనపు ఆఫర్ ద్వారా మహీంద్రా కంపెనీ కొత్త కారును కొనుగోలు చేసేవాళ్లకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుండటం గమనార్హం. అయితే ప్రాంతం, షోరూమ్ ను బట్టి ఈ ఆఫర్ లో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సమీపంలోని మహీంద్రా షోరూమ్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ కారుతో పాటు ఇతర కార్లను కొనుగోలు చేసేవాళ్లకు కూడా మారుతి తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుండటం గమనార్హం. ఎక్స్‌యూవీ 300 కారును కొనుగోలు చేస్తే ఏకంగా 44,500 రూపాయల వరకు తగ్గింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎక్స్‌యూవీ 500 మోడల్‌ కారు కొనుగోలుపై 85,800 రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

స్కార్పియో కారును కొనుగోలు చేసిన వాళ్లకు 36,500 రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. బొలెరో కారుపై 17,500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉండగా కేయూవీ100 ఎన్ఎక్స్‌టీ కారుపై 62 వేల రూపాయల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మరాజో కారుపై ఏకంగా 41 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.

Back to top button