విద్య / ఉద్యోగాలు

ఎస్బీఐలో 5237 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 5237 క్లర్క్‌ జాబ్స్‌ కోసం ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మే 17వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

5237 ఉద్యోగ ఖాళీలలో తెలంగాణ విభాగంలో 275 ఖాళీలు ఉండగా నేటి నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కేవలం ఒక స్టేట్ నుంచి మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీ/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా రిజర్వేషన్లను బట్టి వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు కాగా మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉండగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. గంట సమయంలో జరిగే ఈ పరీక్షలో ఇంగ్లీష్, రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

Back to top button