వ్యాపారము

ఎస్బీఐ సూపర్ ఆఫర్.. రూ.150 కడితే రూ.50 వేలు..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. అడ్డూఅదుపు లేకుండా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కరోనా రక్షక్ పాలసీ పేరుతో ఎస్బీఐ కొత్త పాలసీని కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ పాలసీ అయిన ఈ పాలసీని తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే కరోనా సోకిన సమయంలో చెల్లించాల్సిన ఖర్చుల విషయంలో ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఎటువంటి మెడికల్ పరీక్షలు లేకుండానే ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉండగా ఈ పాలసీ ద్వారా ఏకంగా 100 శాతం బీమాను పొందే అవకాశం ఉంటుంది.

ఈ పాలసీ కనిష్ట ప్రీమియం 156 రూపాయలు కాగా గరిష్ట ప్రీమియం 2230 రూపాయలుగా ఉంది. 105 రోజులు, 195 రోజులు, 285 రోజుల కాల పరిమితితో ఈ పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది. కనీసం 50 వేల రూపాయల నుంచి గరిష్టంగా 2.5 లక్షల రూపాయల వరకు బీమా పొందే అవకాశాలు ఉంటాయి. . 022 – 27599908 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే కాలపరిమితి లోపు కరోనా సోకితే పూర్తి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ లైఫ్ వెబ్ సైట్ ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Back to top button