వ్యాపారము

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఈ అకౌంట్ తో రూ.30 లక్షలు..?

SBI Salary Account

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ కస్టమర్ల కొరకు ఎన్నో సర్వీసులు అందిస్తుండగా ఆ సర్వీసులలో అకౌంట్ సర్వీసులు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. జీరో అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఇలా పలు రకాల అకౌంట్లు ఎస్బీఐలో ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు పలు బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఎస్బీఐ శాలరీ అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లకు జీరో మినిమమ్ బ్యాలెన్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, లోన్ రిబేటు, మరికొన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఎస్బీఐ కస్టమర్లు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ శాలరీ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ప్రమాదంలో మృతి చెందితే యాక్సిడెంటల్ డెత్ కవర్ ను అందిస్తుండటం గమనార్హం. సాధారణ ప్రమాదాలలో 20 లక్షల రూపాయల వరకు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ శాలరీ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే మాత్రం ఏకంగా 30 లక్షల రూపాయల వరకు బీమా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. శాలరీ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లు లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రిబేటును పొందే అవకాశంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద ముందుగానే రెండు నెలల శాలరీని ముందుగానే పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎస్బీఐ శాలరీ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్బీఐ శాలరీ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు లాకర్ చార్జిల్లో కూడా తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఉచిత నెఫ్ట్/ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించడంతో పాటు ఉచితంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంటుంది.

Back to top button