అత్యంత ప్రజాదరణసినిమా

స్కామ్-1992: ఇండియాలో టాప్ వెబ్ సిరీస్.. ప్రత్యేకతేంటీ?

Scam-1992: Top web series in India.. What is special?

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. గత ఏడునెలల తర్వాత ఇటీవలే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు సినిమాల చేసేందుకు సినిమా హాళ్లకు పెద్దగా వెళ్లడంలేదని తెలుస్తోంది. దీంతో ఎక్కడివేసిన గొంగడి అక్కడే అన్నచందంగా థియేటర్ల పరిస్థితి తయారైంది.

Also Read: ‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

కరోనా ఎఫెక్ట్ తో అత్యధికంగా లాభపడింది మాత్రం ఓటీటీలే. థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లోనే రిలీజు కావాల్సి వచ్చింది. దీంతో ఓటీటీల బిజినెస్ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా మారింది. గత ఆరునెలలు ప్రేక్షకులంతా ఓటీటీల్లో సినిమాలను చూసేందుకు అలవాటుపడిపోయారు. దీంతో ఓటీటీలు వారిని మరింత ఆకట్టుకునేందుకు సరికొత్త కంటెంట్ తో వెబ్ సీరిసులను తెరకెక్కిస్తున్నాయి.

ఓటీటీల్లో ప్రత్యేక ఆకర్షణగా వెబ్ సీరీసులు నిలుస్తున్నాయి. సినిమాకు మించిన కంటెంట్ ను అందిస్తూ సినీప్రియులను తమవైపు తిప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సోని లైవ్ లో ఎటువంటి అంచనాల్లేకుండా స్కామ్ 1992 వెబ్ సీరిసు రిలీజైంది. ఈ వెబ్ సీరిసుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన వెబ్ సీరిసులలో ఇదే నెంబర్ వన్ వెబ్ సీరిస్ అనే ప్రశంసలను దక్కించుకుంటోంది.

దీంతో స్కామ్ 1992 వెబ్ సీరిస్ గురించి తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. ఈ వెబ్ సీరిస్ విషయానికొస్తే.. 1990 దశకంలో స్టాక్ మార్కెట్లో ఓ భారీ కుంభకోణం వెలుగుచూసింది. హర్షద్ మెహతా అనే వ్యక్తి ఎలా కుంభకోణానికి పాల్పడ్డాడు అనే కథాంశంతో ఈ వెబ్ సీరిస్ తెరకెక్కింది. ప్రతీక్ గాంధీ ఇందులో హర్షద్ మెహతా నటిస్తున్నాడు.

Also Read: కొత్తలొల్లి షూరు.. బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్.. ఎందుకంటే?

షాహిద్.. సిటీలైట్స్.. అలీగడ్ లాంటి వెబ్ సీరిసులను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా స్కామ్ 1992 వెబ్ సీరిసును తెరకెక్కించాడు. ఈ వెబ్ సీరిసు చూసిన క్రిటిక్స్ ఇప్పటివరకు ఇండియాలో రిలీజైన వెబ్ సీరిసులలో ఇదే నెంబర్ వన్ అంటూ కితాబు ఇస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ ఏకంగా ఈ స్క్రీప్టుతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో పాఠాలు చెప్పొచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం.

దీంతో ఈ వెబ్ సీరిసులో ఏదో ప్రత్యేక ఉందనే సినీప్రియులు భావిస్తున్నారు.ఈ వెబ్ సీరిసును చూసిన వారంతా స్కామ్ 1992పై ప్రశంసలుకురిపిస్తుండటంతో దీనిని చూసేందుకు ప్రతీఒక్కరూ ఇంట్రెస్టు చూపుతున్నారు. దీంతో ఈ వెబ్ సీరిస్ ఓటీటీల్లో సంచలన రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతోంది. వీలుంటే మీరు కూడా ఓ లుక్కేయండి..!

Back to top button