అప్పటి ముచ్చట్లుసినిమా వార్తలు

ఒక్క తప్పుతో కెరీర్ నే పోగొట్టుకున్న హీరోయిన్స్ !

America Event
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ ఇద్దరూ అప్పుడప్పుడే మంచి అవకాశాలను అందుకుంటూ.. స్టార్ డమ్ కి దగ్గరలో ఉన్నారు. అలాంటి సమయంలో ఏ హీరోయిన్లు అయినా బయట నుండి వచ్చే ఆఫర్లకు తలొగ్గరు, ముఖ్యంగా ఫారెన్ ఈవెంట్లకు. కానీ తెలిసి తెలియక ఆ హీరోయిన్స్ ఇద్దరూ అమెరికాలో జరిగే ఒక ఈవెంట్ కి ఓకే చెప్పారు. అక్కడికి వెళ్లారు, అంతా హ్యాపీ. చక్కని రెమ్యునరేషన్, అంతకు మించిన గిఫ్ట్ లు, అన్నిటికిమించి అసలు కష్టమే లేదు. పైగా ఒక సినిమాకి వచ్చే ఎమౌంట్, కేవలం వన్ వీక్ లోనే వచ్చేస్తోంది.

అందుకే ఈవెంట్ ఆయిపోయినా.. ఆ హీరోయిన్స్ మాత్రం మరో వారం రోజులు అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి అక్కడ ఒక మేనేజర్ ను కూడా మాట్లాడుకున్నారు. ఆ నిర్ణయమే స్టార్ గా వెలిగిపోవాల్సిన వారి జీవితాలను అంధకారంలో పడేసింది. అమెరికాలో జరిగిన శృంగార పరమైన స్కాండల్ విషయంలో ఆ ఇద్దరు హీరోయిన్స్ అడ్డంగా బుక్కయ్యారు. అమెరికా పోలీసులు వీరి పై కేసు కూడా పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత అక్కడి కొన్ని పెద్ద తలకాయల సాయంతో ఆ కేసునుండి బయటపడ్డారు ఆ హీరోయిన్స్ ఇద్దరూ.

ఇక ఇద్దరు హీరోయిన్స్ హైట్ లో తక్కువే అలాగే అందంలోనూ తక్కువే. అయినా ఇద్దరికీ అనుకోకుండా మంచి క్రేజ్ వచ్చింది. ఒక హీరోయిన్ కి సంచలన హిట్ అయిన బోల్డ్ సినిమాతో బ్రేక్ వస్తే.. మరో హీరోయిన్ కి క్రియేటివ్ డైరెక్టర్ నిర్మాణంలో వచ్చిన సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. పైగా ఇద్దరూ ఒకే వయసు వారు, ఇంచుమించు ఇద్దరూ ఒకేలా ఉంటారు కూడా. ఒక హీరోయిన్ నితిన్ నటించిన లాస్ట్ సూపర్ హిట్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది. అలాగే మరో హీరోయిన్ ‘మహానటి’ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది.

మొత్తానికి అమెరికాలో జరిగిన ఆ స్కాండల్ ఎఫెక్ట్ తో ఈ హీరోయిన్స్ ఇద్దరి జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆ కేసు నుండే ఆ హీరోయిన్స్ కు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఇతర భాషల్లో ప్రయత్నాలు చేసినా.. అక్కడ అదే పరిస్థితి ? అంతకుముందు ఉన్న కమిట్మెంట్స్ కోసం సినిమాలు చేశారు కానీ, ఆ తరువాత ఏ సినిమా అఫర్ వీరికి రాకపోవడంతో.. మొత్తానికి ఆ హీరోయిన్స్ కెరీర్ నే పోగొట్టుకున్నారు.

Back to top button