ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆంధ్రప్రదేశ్బ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

తెలంగాణ బాటలో ఏపీ.. అక్కడా మూసివేత

Schools closed in AP

కరోనా కల్లోలం ఇదే మార్చిలో గత సంవత్సరం మొదలైంది. సరిగ్గా ఏడాది తర్వాత పూర్తిగా తగ్గుతుందనుకుంటున్న దశలో మళ్లీ దేశంలో కేసులు పెరుగుతున్నాయి. వైరస్ విస్తృతి పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఇప్పుడు ఏపీలో కేసులు పెరుగుతున్నా దృష్ట్యా అక్కడ కూడా బడులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా తగ్గిపోయిందని.. ఇక వ్యాక్సిన్ వేసుకుంటే రాదని అనుకున్నాం. కానీ వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టిన సమయంలోనే మళ్లీ వైరస్ విజృంభిస్తుండడంతో జనాలు అయోమయం చెందుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టడంతో దేశంలో కాస్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక ఈ పీడ తొలిగిపోయిందనుకునేసరికి మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా పాఠశాలలు ప్రారంభించిన తరువాత విద్యార్థుల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ఇక పాఠశాలలు మూసివేత తప్పదని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు

గత సంవత్సరం ఆరంభంలో ఏపీలో కరోనా కేసులు పెద్దగా వెలుగుచూడలేదు. కానీ వలస కార్మికులు తమ స్వగృహాలకు వెళ్లడం ప్రారంభించాక వైరస్ కేసులు ఏపీలో భారీగా పెరిగాయి. అంతేకాకుండా మరణాలు కూడా పెద్ద ఎత్తున సంభవించాయి. అయితే కొన్ని అత్యవసర షాపులు, దుకాణాలు తెరిచిన ప్రభుత్వం పాఠశాలలను మాత్రం మూసివేసే ఉంచింది. విద్యార్థులకు ఆన్లౌన్ ద్వారా అవసరమైన బోధనను అందించింది.

ఇప్పుడు మళ్లీ వైరస్ తగ్గడంతో పాఠశాలలు తెరిచింది. అయితే కేసులు మళ్లీ పెరుగుతుండడంతో బడులు మూసివేయాలని నిర్ణయించిందని సమాచారం. ముఖ్యంగా స్కూళ్లలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో మొన్ననే తెలంగాణ రాష్ట్రం పాఠశాలలను బంద్ చేయించింది. తాజాగా ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొనడంతో పాఠశాలలను మూసివేస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో లాగా పరిస్థితి తీవ్రం కాకముందే పాఠశాలలు మూసివేశారు. మళ్లీ కరోనా కేసులు తగ్గితేనే తెరుస్తారు. బహుషా వ్యాక్సిన్ మొత్తం పంపిణీ అయ్యాకే పాఠశాలలు తెరిచే అవకాశం కనిపిస్తోంది.

Back to top button