ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

Ap Schools: నేటి నుంచే బడులు.. కొనసాగేనా?

schools re-opening today in andhra pradesh with covid-19 precautions

With this, the education system is limping. In this context, the Andhra Pradesh government has taken steps to start schools from the 16th of this month.

కరోనా కల్లోలంతో ఇప్పటికే ఏడాదిన్నరగా విద్యార్థుల చదువులు కొండెక్కాయి. పాఠశాలలు, కళశాలలకు వెళ్లకుండా ఆన్ లైన్ చదువుల పేరిట విద్యార్థులు కళ్లు ఖరాబ్ అవుతున్నాయి. అర్థం కాని ఆ చదువులతో పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైఎస్ జగన్ సర్కార్ అన్నిఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుంచి పున: ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా థర్డ్ వేవ్ భయాలు పొంచి ఉండడం.. ఇంకా వైరస్ తీవ్రత అంతగా లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారినపడకుండా ఉండేలా విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు చేపట్టింది. దీనిలో భాగంగా నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొలి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.

రెండో విడత నాడు-నేడు పనులను సీఎం తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతించనున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పాఠశాలలను ఉదయం, సాయంత్రం శానిటైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు ప్రతీరోజు స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఏ విద్యార్థికైనా కోవిడ్ లక్షణాలుంటే వారిని వైద్యపరీక్షలకు పంపి ఒక గదిని కేటాయించి ఆరోగ్య పర్యవేక్షణ చేస్తారు. ప్రతి వారం వైద్య పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఒక్కరికి పాజిటివ్ ఉన్నా అందరికీ సోకుతుంది కాబట్టి పకడ్బందీగా విద్యార్థులందరికీ పరీక్షలు జరిపేలా విద్యాశాఖ అన్ని స్కూళ్లకు ఆదేశాలు పంపింది.

Back to top button