అంతర్జాతీయంరాజకీయాలుసంపాదకీయం

రెండో ప్ర‌పంచ యుద్ధంః ల‌క్ష మందిపై అత్యాచారం!

ఈ ప్ర‌పంచంపై సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ చూపిన ప్ర‌భావం అసామాన్య‌మైంది. 1939లో మొద‌లైన ఈ యుద్ధం 1945 వ‌ర‌కు కొన‌సాగింది. జ‌ర్మ‌నీ రాజ‌ధాని బెర్లిన్ ను సోవియ‌ట్ సైన్యం ఆక్ర‌మించుకోవ‌డం, హిట్ల‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌తో ముగిసింది. దీనంత‌టికీ కార‌ణం హిట్ల‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. జాతి దుర‌హంకారంతో.. నాజీల‌ను ఒక అలౌకిక స్థితిలోకి తీసుకెళ్లిన అడాల్ఫ్ హిట్ల‌ర్‌.. ప్ర‌పంచ యుద్ధానికి కార‌కుడు అయ్యాడు.

అయితే.. ఈ నియంత‌ను ఎద‌రించేందుకు ప‌లు దేశాలు కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఒక కూట‌మిలో జ‌ర్మ‌నీ, జ‌పాన్, ఇటలీ కూట‌మి ఉండ‌గా.. మ‌రోవైపు సోవియ‌ట్ యూనియ‌న్‌, ప్రాన్స్‌, బ్రిట‌న్‌, చైనా, పోలెండ్ నిలిచాయి. అమెరికా కూడా త‌ర్వాత వీరితోనే క‌లిసింది. సుదీర్ఘంగా ఆరేళ్ల‌పాటు సాగిన ఈ పోరులో జాత్య‌హంకార కూట‌మి ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇందులో సోవియ‌ట్‌ ర‌ష్యా సేన‌లు సాగించిన పోరాటం చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన‌ది.

అయితే.. రెండో ప్ర‌పంచ యుద్ధం చివ‌ర‌లో జ‌ర్మ‌నీ రాజ‌ధాని బెర్లిన్ ను ఆక్ర‌మించుకునే క్ర‌మంలో ర‌ష్యా సేన‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచాల‌కు పాల్ప‌డ్డాయ‌నే విష‌యం ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒక‌ప్పుడు సోవియ‌ట్ యూనియ‌న్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ కు చెందిన వ్లాదిమిర్ జెల్ఫాండ్ అనే లెఫ్టినెంట్ ఈ విష‌యాల‌ను త‌న డైరీలో రాసుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న అప్ప‌టి ర‌ష్యా సైన్యంలో ఓ అధికారిగా ఉన్నారు. ఈ వివ‌రాల‌న్నీ ర‌హ‌స్యంగా త‌న డైరీలో పొందు ప‌రిచిన‌ట్టు స‌మాచారం.

బెర్లిన్ న‌గ‌రాన్ని అదుపులోకి తీసుకునేందుకు దాదాపు 5 వేల మంది ర‌ష్యా సైనికులు వ‌చ్చారు. వీరిని అడ్డుకునేందుకు అక్క‌డి మ‌హిళ‌లు సిద్ధ‌మయ్యారు. అయితే.. వారు సోవిట్ సైన్యం ముందు నిల‌వ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే.. ర‌ష్యా సైన్యం మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు సాగించింద‌ని ఆ డైరీలో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. అయిఏ.. జ‌ర్మ‌న్ మ‌హిళ‌ల‌పై సోవియ‌ట్ సేన‌లు దురాగ‌తం సాగించాయ‌ని చెప్ప‌డానికి ఖ‌చ్చిత‌మైన ఆధారాలు మాత్రం లేవు.

అయితే.. జ‌ల్ఫాండ్ తోపాటు గుర్తు తెలియ‌ని ప‌లువురు త‌మ డైరీల్లో ఈ దురాగ‌తాల‌ను రాసుకొచ్చార‌ని అంటారు. అంచ‌నా ప్ర‌కారం బెర్లిన్ న‌గ‌రంలో దాదాపు ల‌క్ష మందిపై అత్యాచారం చేసి ఉంటారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై డైరీ రాసిన జెల్ఫాండ్ త‌న‌యుడు విట‌లీ జెల్ఫాండ్ ఇటీవ‌ల మీడియాతో మాట్ల‌డుతూ… రెండో ప్ర‌పంచ యుద్ధంలో సోవియ‌ట్ యూనియ‌న్ సైన్యం చేసిన వీరోచిత పోరాటాన్ని త‌క్కువ చేయ‌లేం. వారి దైర్య సాహ‌సాలు అమోఘం. అయితే.. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. అంద‌రికీ.. తెలిసిన దాన్ని మాత్ర‌మే నిజ‌మ‌ని అనుకోకూడ‌దు’’ అని చెప్పడం గమనార్హం.

Back to top button