క్రీడలు

వికెట్లను తన్ని.. నేలకోసి కొట్టి.. మ్యాచ్ లో క్రికెటర్ వీరంగం

Shakib Al Hasan on the battlefield in the match

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ చేసిన పని ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపింది. షకీబ్ పై ఇంటా, బయటా విమర్శల వాన కురుస్తోంది. అతడు చేసిన పని క్రికెట్ మాయని మచ్చ అని.. సిగ్గుచేటు అని మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో కోపంతో షకీబ్ అల్ హాసన్ రగిలిపోయాడు. ఈ మ్యాచ్ లో షకీబ్ తొలిసారి ఓ ఎల్.బీ.డబ్ల్యూ కు అప్పీల్ చేశాడు.అయితే అంపైర్ దాన్ని కొట్టిపడేశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన షకీబ్ కాలితో వికెట్లను తన్నేశాడు.

ఇక ఆ తర్వాత వర్షంతో రెండు ఓవర్ల తర్వాత మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్టుగా అంపైర్ ప్రకటించాడు. దానికి కూడా సీరియస్ అయిన షకీబ్ రెండోసారి వికెట్లను అమాంతం ఎత్తి కింద నేలకేసి కొట్టాడు. ఇదంతా వీడియోల్లో రికార్డ్ కావడంతో ఈ దిగ్గజ ఆల్ రౌండర్ పరువు పోయింది. అందరూ చీవాట్లు పెట్టడంతో మ్యాచ్ అనంతరం సారీ చెప్పాడు.

‘నా కోపంతో మ్యాచ్ లో అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నా.. నాలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా చేయాల్సింది కాదు.. కానీ కొన్ని సార్లు అనుకోకుండా ఇలా జరిగిపోతాయి.. దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. జట్టును, నిర్వాహకులను. ప్రేక్షకులను క్షమాపణలు కోరుతున్నారు. భవిష్యత్ లోనూ ఇలాంటి తప్పిదాలు చేయనని బలంగా నమ్ముతున్నా అని పేర్కొన్నాడు. ఇప్పుడు షకీబ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Back to top button