టాలీవుడ్సినిమా

స్టార్ హీరో భార్యకి అవమానం !


కరోనా కాలంలో కష్టాలు సహజం. మనం వాటిని దైర్యంగా ఎదురుకోవాలి అని కడుపు నిండిన వాళ్ళు చెబితే, వినడానికి అది అంతగా బాగోదు. పైగా, వినేవాళ్ళకు కాలుతుంది. ఆ కాలిన తరువాత, వాళ్ళు మనల్ని ఏమైనా అనొచ్చు. వాళ్ళు నోరు జారకా మనం ఏం చేయగలం.. సైలెంట్ గా అక్కడ నుండి తప్పుకోవడం తప్ప.. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ఏమి అనడానికి కూడా లేదు కదా. ఇంతకీ ఈ బాగోతం అంతా ఎవరి గురించి అంటే.. ఒక స్టార్ హీరో సతీమణి గురించే. అమెది చాల పెద్ద కుటుంబం.. పైగా స్టార్ హీరోకి భార్య.. అయితే ఇవేమీ ఆమెలో ఎప్పుడు కనిపించవు. ఒక సగటు మహిళలానే ప్రవర్తిస్తుంది. కాకపోతే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందిలేండి.

Also Read: పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

పైగా ప్రతి రోజూ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. అందులో భాగంగా యోగా ధ్యానం నుండి మంచి ఆహార‌పు అల‌వాట్ల దాకా చాలానే చెబుతుంది. ఆమెకు చెప్పే అర్హత కూడా ఉందాయే,. అందుకే ఆమె చెప్పే టిప్స్ ను ఫాలో అయ్యేవాళ్ళు కూడా లెక్కకు మించే ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కాకపోతే, మధ్యమధ్యలో తానూ చేసే చిన్న సామాజిక సేవ గురించి, అలాగే ప‌నిలో ప‌నిగా త‌మ హెల్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన‌ కంపెనీల బిజినెస్ లను కూడా ప్ర‌మోట్ చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోయేవారు ఆమె. అయితే, ఈ మధ్య ఆ స్టార్ హీరో సతీమణి స‌డెన్ గా ఇవ‌న్నీ ఆపేసారు.

Also Read: వెంకీ 75వ చిత్రం.. రేసులో ముగ్గురు దర్శకులు

ఎందుకు ఆపారో అని ఆమెను ఫాలో అయ్యేవారికి ఈజీగానే అర్ధం అయిపొయింది. మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే.. కొంత‌కాలం క్రితం ఆ స్టార్ హీరో వైఫ్ తన అలవాట్లులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ వివరిస్తూ ఉండగా.. క‌రోనా మ‌హ‌మ్మారీ గురించి నెటిజ‌నుల నుండి, ఆమెకు ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది‌. మీరు మీ కుటుంబం హెల్త్ రంగంలో ఉన్నారు కదా, ప్ర‌జ‌లు క‌ష్టాన్ని ఎదుర్కొంటున్నారని మీరే అంటున్నారు, క‌రోనా వల్ల ఆర్థిక భారాన్ని మోయ‌లేక చాలామంది చితికిపోతున్న సంగతి కూడా మీకు తెలుసు. మరి అలాంటి వారికి మీరు ఉచితంగా మందులు ఎందుకు స‌ర‌ఫ‌రా చెయ్యట్లేదు ? హెల్త్ టిప్స్ చెప్పడానికి చాలామంది ఉన్నారు. మీరు మీ స్థాయిలో సేవ చేయండి’ అని ఆ స్టార్ హీరో సతీమణిని నిల‌దీశారట నెటిజన్లు. ఇక అప్పటి నుండే ఆమె అది అవమానంగా ఫీల్ అయి.. సోష‌ల్ మీడియా యాక్టివిటీస్ దూరంగా ఉంటూ వస్తోంది.

Tags
Back to top button
Close
Close