ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆంధ్రప్రదేశ్బ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

షర్మిల పార్టీ రంగు, జెండా ఇదేనా?

Sharmila's party color, is this the flag?

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో జెండా పాతడానికి ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలో ఈరోజు నిర్వహించే సభతో తన రాజకీయ ప్రస్థానాన్ని షర్మిల ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ నుంచి భారీ కార్ల ర్యాలీతో వచ్చిన వైఎస్ షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అక్కడి నుంచి సూర్యపేట మీదుగా ఖమ్మంకు చేరుకున్నారు.

షర్మిల దారిపొడవునా ఆమెకు వైఎస్ఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల ముదురు నీలం రంగు అంచుతో లేత పసుపు రంగు చీర ధరించింది. ఇవే ఆమె పార్టీ జెండా గుర్తులు అని అంటున్నారు. అదే రంగులో పార్టీ జెండా ఉంటుందని.. నీలం చివరలో బార్డర్ గా ఉంటుందని అంటున్నారు.

అన్నయ్య పార్టీ వైసీపీలా ఉంటుందని అందరూ అనుకున్నా.. దానికి భిన్నమైన రంగులను షర్మిల ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. ఇక తన రాజకీయ ప్రస్థానంలో సహకరించిన భర్త అనిల్ కు.. తన స్ఫూర్తి అయిన వైఎస్ఆర్ కు ఈ సందర్భంగా షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.

Back to top button