టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

ఎక్స్ క్లూజివ్: రెండో పెళ్లికి ఆమె రెడీ !

anchorబుల్లితెర‌ యాంకర్ గా, వెండితెర‌ నటిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమెలో నటితో పాటు ఆవేశం కూడా ఉంది. ఆ ఆవేశమే ఆమెను భర్తకు దూరం చేసింది. అప్పటినుండి ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ పుకార్లు పుడుతూనే ఉన్నాయి, వాటిని ఆమె ఖండిస్తూనే ఉంది. తనకు రెండో పెళ్లి ఆలోచన లేదని, ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా సెలవిచ్చిన ఆమె, తాజాగా మళ్ళీ పెళ్లి ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది.

అభిన‌యం, మాట‌ల చ‌తుర‌త‌తో యాంక‌ర్‌ త‌న‌కంటూ స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమె, ఎప్పుడూ స‌ర‌దా స‌ర‌దాగానే ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఆమె ధీర వ‌నిత‌లానే వాటిని ఎదుర్కొంది. నిజానికి ఆమె పేరులోనే ఒక వీరత్వం ఉంటుంది. ప్ర‌స్తుతం ఆమె ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది కూడా. వెబ్‌ సిరీస్‌ కంటెంట్ అనగానే.. అడల్ట్‌ కంటెంట్‌ లేదా యూత్ ఫుల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది.

కానీ ఆమె చేస్తోన్న సిరీస్, లవ్, క్రైమ్‌, సెక్స్‌ మించి ఉంటుందట. పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఇప్పటి జనరేషన్ నేర్చుకోవాల్సినవి ఏమి నేర్చుకోకుండా పెద్దవాళ్లు అయిపోతున్నారని, పెరిగే క్రమంలో ప్రతి మనిషి ఏమి చేయాలి, ఎలాంటి ఆలోచనలతో ఉండాలి లాంటి విషయాలనే మెయిన్ ఎలిమెంట్స్ గా పెట్టుకుని ఆమె ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.

ఈ వెబ్ సిరీస్ చేస్తోన్న క్రమంలోనే ఆమెకు ఒక ఫైనాన్సియర్ తో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త అర్ధం చేసుకునే స్థాయికి వెళ్లడం, అతను ఆమెలోని మంచి మనసును గుర్తించి, ఆమెను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇక అతని ప్రవర్తన, అతని మంచి తనం నచ్చడంతో ఆమె కూడా ఎట్టకేలకూ అతనితో రెండో పెళ్ళికి ఒప్పుకుంది. తన స్నేహితురాలు సింగర్ సునీత లానే త్వరలోనే ఆమె కూడా పెళ్లి చేసుకోనుంది.

Back to top button