అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలు

బహిర్గతమైన టీడీపీ దశ్చర్య.. హవ్వా.. మరీ ఇంత ఘోరమా…?

Temple shifting

ఏపీలో వైస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ ఏదో ఒక రకంగా దుశ్చర్చకు పాల్పడుతూనే ఉంది. సమస్య లేనిచోట కొత్త సమస్యను తయారు చేసి హైడ్రామాకు తెర లేపుతోంది. అంత చేస్తున్నా… తెలుగు తమ్ముళ్ల తెలివి తక్కవ తనానికి అడ్డంగా బుక్కవుతున్నారు. పై స్థాయిలో ఉన్న కొంతమంది చర్యల వల్ల కిందిస్థాయి కార్యకర్తలు బలవుతున్నారు… కార్యకర్తలే కాదు.. ప్రజలను సైతం రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు అనేక రకాల సంఘటనలు చోటు చేసుకున్నా.. ఆలయాల కూల్చివేత విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని టీడీపీ కక్ష కట్టింది. ఎన్నో రాజకీయ కుట్రలకు తెర లేపింది. అన్నింటిని జగనన్న సైన్యం ధీటుగా ఎదుర్కొంటూనే… సరైన సమాధానం ఇస్తోంది.

Also Read: ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ మరో షాక్?

రాజకీయ ఉనికి కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోందన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలిగిస్తూ అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ తమ్ముళ్లు. తొలగించిన విగ్రహాన్ని సమీపంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న సిమెంట్‌ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వారి బండారం బయటపడింది. ఈనెల 14న సంతబొమ్మాళిలోని అతి పురాతన పాళేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారడంతో గ్రామస్తుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా విషయం వెలుగు చూసింది.

ఈ విషయంపై విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు మాట్లాడుతూ.. సంతబొమ్మాళి మండలం పాళేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ తరలింపు చట్ట విరుద్ధమని, విగ్రహం తరలింపు వెనుక దురుద్దేశం కనిపించిందని పేర్కొన్నారు. ముందురోజు పోలీసులు వివరాలు అడిగినా చెప్పని ఆలయ వర్గాలు.. గుట్టుగా రోడ్డు మధ్యలో విగ్రహాన్ని పెట్టాలని యత్నించారని తెలిపారు. ఈ కేసులో వీఆర్వో 22 మంది పై ఫిర్యాదు చేయగా, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పేర్కొన్నారు.

Also Read: ఏపీ డీజీపీ ఉగ్రరూపం.. పచ్చపార్టీ నేతలకు గట్టి వార్నింగ్

ఇప్పటికే ఆలయాల కూల్చివేత ఘటనలపై సీరియస్ గా ఉన్న డీజీపీ సవాంగ్ టీడీపీ దుశ్చర్చలపై వార్నింగ్ ఇచ్చినా.. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు కేసును సీరియస్ తీసుకుని విచారణ చేస్తున్నారు.. చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు.. టీడీపీని ప్రజలందరూ ఛీ అంటున్నా.. వారి పిచ్చి చేష్టలు మాత్రం మారడం లేదు. తెలుగు తముళ్లను ఎరగా వేసి చంద్రబాబు అండ్ కో.. నడిపిస్తున్న రాజకీయ కుట్రలను త్వరలోనే భూ స్థాపితం చేస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. అమాయకపు ప్రజలను బలి చేయాలని చూస్తే.. ఊరుకోమని హెచ్చరిస్తున్నారు

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button