బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

రాజ్ కుంద్రా అశ్లీల వ్యాపారంలో శిల్పాశెట్టి? విచారణలో ట్విస్ట్

Shilpa Shetty Statement on Raj Kundra Caseబాలీవుడ్ లో రాజ్ కుంద్రా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణంలో వ్యాపార కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. ఎందరో యువతుల్ని రొంపిలోకి దింపి పావులుగా చేసుకున్నట్లు సమాచారం. రూ. కోట్ల కుంభకోణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈనెల 27 వరకు కస్టడీలో ఉంచుకోనున్నారు. ఆయనను విచారణ చేస్తున్నారు. పోర్న్ వీడియోల నిర్మాణంలో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ర్టలో పోర్న్ వీడియోల కుంభకోణం ఓ కుదుపు కుదుపేసింది. చలన చిత్ర రంగాన్ని మరో కోణంలో బయటపెట్టింది. ఇప్పటి వరకు డ్రగ్స్ తదితర కేసుల్లో సినిమా తారలు బయటకొచ్చినా అశ్లీల చిత్రాల వ్యవహారంలో మొదటి సారి రాజ్ కుంద్రాపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. నటి శిల్పాశెట్టిని సైతం ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా వ్యవహారం చలనచిత్ర రంగంలో మరో సంచలనంగా చెప్పుకోవచ్చు.

పోర్న్ రాకెట్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టిని ఆరు గంటల పాటు విచారించారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని శిల్ప ఇంటికి చేరుకున్న ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా వ్యాపారాలపై ప్రశ్నలు వేశారు. రాజ్ కుంద్రా కుట్రలో ఆమెకు ఏమైనా ప్రమేయం అందా అనే అనుమానాలపై ఆరా తీశారు. కుంద్రాకు చెందిన సంస్థ వియాన్ లో శిల్ప డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడంతో ఆమె పాత్రపై విచారణ చేపట్టారు.

అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే సమాచారంతో ఓ బంగ్లాపై పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఒక్కో నిజం వెలుగు చూస్తుంటే పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పోర్న్ రాకెట్ లో కీలకంగా మారిన రాజ్ కుంద్రాను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతను మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి. విచారణ అనంతరం కోర్టు అతడిని 27 వరకు కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశించింది.

Back to top button