తెలంగాణరాజకీయాలు

రైతులకు షాక్.. కేసీఆర్ కు లైన్ క్లియర్

Shock to farmers .. Line clear to KCR

నాగార్జునసాగర్ లో సీఎం కేసీఆర్ సభకు లైన్ క్లియర్ అయ్యింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన రైతులకు షాక్ తగిలింది. నాగార్జున సాగర్ లో నిర్వహించతలపెట్టిన కేసీఆర్ సభకు అడ్డంకులు తొలిగిపోయాయి.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 14న సీఎం కేసీఆర్ భారీ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టులో సీఎం సభను రద్దు చేయాలంటూ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది. పిటీషన్ ను విచారించిన హైకోర్టు దీన్ని తిరస్కరించారు. సభను రద్దు చేయాలని రైతులు వేసిన పిటీషన్ ను విచారించడానికి హైకోర్టు అనుమతించలేదు.

నిన్ననే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రైతులు చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గర అప్పీల్ చేశారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటీషన్ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని సభకు అనుమతి ఇవ్వవద్దని పిటీషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ సభను రద్దు చేయాలని కోరారు.

ప్రభుత్వ జీవో 69 విడుదల నేపథ్యంలో కోవిడ్ నిబందనల ప్రకారం సభలు, సమావేశాలు చేయకూడదని.. లక్షలాది మందితో సభ ఎలా పెడుతారని పిటీషన్ దాఖలు చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం సభకు రద్దు చేయాలన్నారు.

హౌస్ మోషన్ కు అనుమతిపై ఎదురుచూసిన రైతులకు షాక్ తగిలింది. హౌస్ మోషన్ విచారణకు అనుమతి నిరాకరించిన న్యాయస్థానం రైతుల పిటీషన్ ను తోసిపుచ్చింది. దీంతో సాగర్ లో రేపు యధావిధిగా సీఎం సభ జరుగనుంది.

Back to top button