తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

పవన్ కు షాక్: చేతిలోంచి జారిన ‘గాజు గ్లాస్’

Shock to Pawan: Janasena loses 'Glass'

జనసేనాని పవన్ కళ్యాణ్ చేతిలోంచి ‘గాజు గ్లాస్’ చేజారిపోయింది. ఇప్పటికే తిరుపతిలో పోటీచేయకపోవడంతో జనసేన గుర్తు గాజు గ్లాస్ ను మరో పార్టీ అభ్యర్థికి కేటాయించారు. ఇక తెలంగాణలో పూర్తిగా ‘గాజు గ్లాస్’ పవన్ దూరమైంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చిన పాపానికి జనసేనకు ఇప్పుడు ‘గాజు గ్లాస్’ దూరమైంది. అటు కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న పవన్ కు ఈ న్యూస్ షాకింగ్ అనే చెప్పాలి. ఒక పార్టీకి గుర్తు కంటే పెద్దది ఏదీ లేదు. కానీ పవన్ పోటీచేయకుండా బీజేపీకి సపోర్టు చేస్తూ ఇప్పుడు తమ ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి రావడమే జనసైనికులను షాక్ కు గురిచేస్తోంది.

తాజాగా తెలంగాణలో జరుగున్న ఖమ్మం, వరంగల్ తోపాటు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. 30న జరిగే ఈ ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన నిర్ణయించి ఉమ్మడి గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘం కోరింది.

అయితే నిబంధనల ప్రకారం గత ఎన్నికల్లో 10శాతం సీట్లలో అయినా పోటీచేసి ఉంటే ‘కామన్ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాస్’ను కేటాయిస్తారు. కానీ గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దిగి వైదొలిగి బీజేపీకి మద్దతు ఇచ్చారు పవన్. అసలు పోటీనే చేయలేదు. దీంతో గాజు గ్లాస్ గుర్తు జనసేనకు గల్లంతైంది.

గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చామని.. ఈసారి అన్ని చోట్లా పోటీచేస్తామని.. తమకు కామన్ గుర్తు ‘గాజు గ్లాసు’ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని జనసేన కోరింది. కానీ నిబంధనల ప్రకారం పోటీ, ఓట్లశాతం లేనిదే ఇవ్వలేదని తెలంగాణ ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఈ గాజు గ్లాస్ ఇప్పుడు ‘స్వతంత్రులకు కేటాయించనున్నారు.

ఇప్పుడు కామన్ గుర్తు లేకపోవడంతో జనసేన పార్టీ అభ్యర్థులు కూడా స్వతంత్రుల కిందే లెక్క. వారికి స్వతంత్రుల్లో ఏ గుర్తు వస్తే అదే తీసుకోవాలి. గాజు గ్లాసును ఆప్షన్ గా ఎంచుకోవచ్చు.

ఇలా తెలంగాణలో పోటీచేయలేక బీజేపీకి మద్దతిచ్చిన జనసేనకు గట్టి షాక్ తగిలింది. ఏపీలోనూ ఇలానే బీజేపీకి మద్దతిస్తూ పోతే ఖచ్చితంగా ‘గాజు గ్లాస్’ పవన్ చేజారి పగిలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Back to top button