టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

షాకింగ్: సినిమా థియేటర్ల మూసివేత

Shocking: Closure of movie theaters

కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. దేశంలో సెకండ్ వేవ్ వచ్చేసింది. మళ్లీ లాక్ డౌన్ లు వచ్చేస్తున్నాయి. ఈ దెబ్బకు బాలీవుడ్ లో సినిమాల విడుదల , షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. ఇప్పుడు ఆ ఉపద్రవం తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది.

తాజాగా టాలీవుడ్ కు కరోనా ఎఫెక్ట్ పడింది. వకీల్ సాబ్ మూవీ విడుదలై రెండో వారంలోకి దూకుతోంది. ఈ సమయంలో కరోనా ప్రబలడంతో అసలు థియేటర్లకు పోయి చూసేందుకు జనాలు సాహసించడం లేదు. దీంతో ఏపీ వ్యాప్తంగా థియేటర్లు మూతపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

వకీల్ సాబ్ తర్వాత టాలీవుడ్ లో రావాల్సిన ‘లవ్ స్టోరీ’, టక్ జగదీశ్ లాంటి సినిమాలు విడుదల కావడం లేదు. కరోనాతో అవి వాయిదా పడ్డాయి. దీంతో ఆంధ్రాలో ‘సినిమాలు లేక థియేటర్లు మూసివేస్తున్నాం’ అని బోర్డు పెట్టి క్లోజ్ చేస్తున్నారు. అదీ కాకు ఏపీ ప్రభుత్వం అదనపు షోలు, టికెట్ రేట్లపై తెచ్చిన జీవో కూడా థియేటర్లను చావు దెబ్బ తీసింది. దీంతో థియేటర్లను మూసివేస్తున్నారు.

ఇప్పటికే ప్రముఖ సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ 30 నుంచి 40వరకు తన థియేటర్లను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. విశాఖలో ఫేమస్ థియేటర్ జ్యోతిని మూసివేశారు. ఇక కాకినాడలోనూ ఆరు థియేటర్లు మూసివేశారు. చాలా మంది థియేటర్లు ఓనర్లు ఏపీలో ఇప్పుడు మూసివేస్తున్నారు.

తెలంగాణలో మాత్రం థియేటర్ల మూత ఇంకా కొనసాగడం లేదు. ఏపీలో మొదలైన థియేటర్ల మూత తెలంగాణకు పాకుతుందని.. ఇక్కడ కూడా సినిమాలు విడుదల కాకుంటే మూత తప్పదంటున్నారు. ఇక 9న రిలీజ్ అయిన వకీల్ సాబ్ ఇప్పటికే థియేటర్లలో సందడి తగ్గింది. జనాలు తగ్గిపోయారు. దీంతో మరో వారానికి థియేటర్ల మూత ఖాయంగా కనిపిస్తోంది.

Back to top button