ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో విస్తుపోయే నిజాలు

Tdepalli Gang Rape Case

సంచలనం సృష్టించిన తాడేపల్లి సమూహ లైంగికదాడి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు కరడుగట్టిన నేరస్తులుగా గుర్తించారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ దారుణ ఘటనలో 50 రోజుల తరువాత నిందితుల ఆచూకీ లభ్యమైంది. పోలీసుల విచారణలో నిందితుడు శేరు కృష్ణ కిషోర్, మూడో నిందితుడు షేక్ హబీబ్ లను అరెస్టు చేశారు. మరో నిందితుడు వెంకట ప్రసన్న రెడ్డి పరారీలో ఉన్నాడు.

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కృష్ణ కిషోర్ సీలింగ్ పనులు చేస్తుండేవాడు. ఇతడికి మహానాడుకు చెందిన వెంకట ప్రసన్నరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు పనులు లేని సమయంలో రైల్వే ట్రాక్ పై రాగితీగలు దొంగిలిస్తూ వాటిని అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈక్రమంలో జూన్ 19న రాత్రి విజయవాడకు చెందిన యువతిపై అత్యాచారం చేశారు. దీనికంటే ముందు రైల్వే ట్రాక్ పై రాగితీగలు దొంగిలించచారు. దీన్ని శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి చూడడంతో అతడిని హత్య చేశారు. అతడి కాళ్లు చేతులు కట్టేసి మెడకు రాగి తీగ చుట్టి చంపేశారు. తరువాత మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశారు.

అనంతరం సీతానగరం ఇసుక దిబ్బలపై ఉన్న జంటను చూసి వారిని బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలించి విజయవాడ వైపు పారిపోయారు. తాడేపల్లి చేరుకుని షేక్ హబీబ్ వద్ద సెల్ ఫోన్లు తాకట్టు పెట్టారు. పోలీసుల భయంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. అనంతరం ఇద్దరు విడిపోయారు. కృష్ణ కర్ణాటక వెళ్లి అక్కడ నుంచి నిర్మల్, భైంసా తదితర పట్టణాలు తిరుగుతూ చివరికి సికింద్రాబాద్ చేరాడు. రైలు పట్టాలపై ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ వచ్చే డబ్బుతో మద్యం సేవించేవాడు. అక్కడే సాయిబాబా గుడిలో తలదాచుకునేవాడు.

కన్నతల్లిని చూసేందుకు తాడేపల్లికి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల కోసం పోలీసులు చిత్తు కాగితాలు ఏరుకునే వారిలా, సమోసాలు అమ్ముకునే వారిలా మారు వేషాలు వేసి నిందితుల కోసం గాలించారు. చివరికి పట్టుకున్నారు. ఇంకో నిందితుడు ప్రసన్న రెడ్డి పరారీలోనే ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Back to top button