ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వైసీపీ నేత హత్య కేసులో విస్తుపోయే నిజాలు..!

Moka-Bhaskar-kollu-ravindra
వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హత్యతో కొల్లు రవీంద్రకు ప్రమేయం ఉన్నట్లు తేలిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. మోకా హత్యకు చింతా నాంచారయ్య, రవీంద్ర కలిసి పథక రచన చేశారని.. దానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయని ఎస్ పి పేర్కొనడంతో, ఈ కేసులో కొల్లు రవీంద్ర పూర్తిగా ఇరుక్కుపోయారని తెలుస్తుంది.
ఇక ఈ హత్య గురించి కొన్ని సంచలన విషయాలు జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా బయటపెట్టారు.  మోకా హ్యతకు 20రోజుల ముందు కొల్లు రవీంద్రను చింతా నాంచారయ్య కలిశాడు. రాజకీయంగా ఎదుగుతున్న మోకా భాస్కర రావును అంతం చేయకపోతే తన మనుగడ కష్టం అని కొల్లు రవీంద్రతో చింతా నాంచారయ్య చెప్పగా…ఇది సమయం కాదు, కొన్నాళ్ళు ఆగాలని, కొల్లు రవీంద్ర సూచించారట. ఐతే ఇంతలోనే ఓ విషయమై మోకా భాస్కర్ రావుకు, చింతా నాంచారయ్యకు మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. దీనితో నాంచారయ్య కొల్లు రవీంద్రను కలిసి భాస్కర రావుని వెంటనే అంతం చేయాల్సిందే అని ప్రతిపాదన పెట్టారట.
దీనికి కొల్లు సరే కానీ… నా పేరు బయటికి రాకుండా చూడండి అని చెప్పారట. హత్య తరువాత కూడా మోకా భాస్కర్ రావు కథ ముగిసిందని కొల్లు రవీంద్రకు నాంచారయ్య ఫోన్ చేసి చెప్పారట. దానికి కొల్లు నాకు ఇకపై ఫోన్ చేయవద్దని…ఏదైనా మాట్లాడాలి అనుకుంటే తన పి ఏ కు కాల్ చేయాలని సూచించడడంతో పాటు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. హత్య అనంతరం కూడా కొల్లు అనుచరులతో పాటు, పీఏతో  నాంచారయ్య పలు మార్లు మాట్లాడినట్లు ఆధారాలున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ విధంగా సినీ పక్కీలో భాస్కర రావు హత్యకు భారీ కుట్ర పన్ని అమలు జరిపినట్టు  ఆయన తెలియజేశారు.
Tags
Back to top button
Close
Close