ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్లైఫ్‌స్టైల్

కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మరో షాక్.. ఆ సమస్యలు?

COVID Cases in India

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండగా కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ ప్రధానంగా శ్వాసకోశవ్యవస్థపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలామందిని ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా వల్ల కాళ్లు చేతులు బలహీనత, మెదడువాపు, పక్షవాతం రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.

తీవ్ర కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లలో 1 నుంచి 2 శాతం మంది పక్షవాతం బారిన పడుతుండటం గమనార్హం. సాధారణంగా వయస్సు పైబడిన వాళ్లలో ఎక్కువమంది పక్షవాతం బారిన పడుతుంటారు. పక్షవాతం బారిన పడటానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమంది చిన్న వయస్సులోనే పక్షవాతం బారిన పడుతుండటం గమనార్హం.

కరోనా చికిత్సలో భాగంగా వైద్యులు కొంతమందికి రక్తాన్ని పలుచన చేసే మందులు ఇస్తున్నారు. ఈ మందులు కూడా మెదడులో రక్తస్రావం అయ్యేలా చేసే అవకాశం అయితే ఉంటుంది. పక్షవాతం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే మంచిది. సత్వరమే చికిత్స తీసుకోవడమే పక్షవాతానికి మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల పక్షవాతం నుంచి త్వరగా కోలుకునే అవకాశం అయితే ఉంటుంది.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో మయోసైటిస్ సమస్య కనిపిస్తోంది. ప్రెడ్నిసోన్ వంటి స్టిరాయిడ్లను తీసుకోవడం ద్వారా మయోసైటిస్ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించినా వైద్యుడిని సంప్రదించి వెంటనే చికిత్స చేయించుకుంటే మంచిది.

Back to top button