క్రీడలుప్రత్యేకం

కల్లోలంలో ఐపీఎల్ కొనసాగించాలా? వద్దా?

Should IPL continue in the wake of corona virus spreading?

దేశంలో ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతోంది. కరోనా కల్లోలం చోటుచేసుకుంది. దేశంలోని ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు పోతున్నాయి. వైద్య సహాయం అందని ద్రాక్షగా మారింది. ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.

ఇంతటి ఉపద్రవం వేళ ఐపీఎల్ పేరిట చేస్తున్న హంగామా? కోట్లు ఖర్చు పెడుతున్న వైనంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రజలు బాధలో ఉంటే దీనికి ఇంత ఖర్చు అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఈ క్రమంలోనే ఆ ప్రభావం ఐపీఎల్ పై కూడా పడింది. పలువురు ఆస్ట్రేలియా , విదేశీ క్రికెటర్లు టోర్నీ నుంచి వైదొలిగారు. మరికొంత మంది వైదొలిగేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్ బౌలర్ ఆండ్రై టై తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

భారత్ లో కరోనా బాధితులకు ఆస్పత్రులు దొరక్క అల్లాడుతుంటే ఐపీఎల్ కోసం ఇంత డబ్బు వెచ్చించడం అవసరమా? అని టై ప్రశ్నించాడు. కరోనా విలయతాండవరం చేస్తూ ఆస్పత్రుల్లో పడకలు దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వం ఐపీఎల్ పై ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఆశ్చర్యం అని ఆండ్రూ టై ఆడిపోసుకున్నారు.

అయితే మరో వాదన కూడా ఉంది. కరోనా కల్లోలంతో అందరూ తీవ్ర డిప్రెషన్ లో ఉందని.. అందరూ ఇంటికే పరిమితమైన ఈ సమయంలో ఒత్తిడి తగ్గేలా ఐపీఎల్ అందరికీ స్వాంతన చేకూరుస్తోందన్న వాదన వినిపిస్తోంది. మరి ఎవరి వాదన ఎలా ఉన్నా ఐపీఎల్ ను మాత్రం ఆపేది లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు.

Back to top button