బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

‘శ్రద్ధ కపూర్’ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు !

ఇప్పుడంతా డిజిటల్ యుగం.. ఈ కాలంలో సోష‌ల్ మీడియాదే హవా. ఇష్టం ఉన్నా లేకపోయినా ఫుల్ ఫాలోయింగ్ నీకు ఉందని చెప్పుకోవాలి అంటే.. సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవ‌ర్స్ ఉండాలి. ఎంత ఎక్కవ మంది ఉంటే, అంత‌గా పాపులారిటీ ఉందని అంచనా వేసే జనం ఉన్న రోజులు ఇవి. అందుకే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ఉన్న స్టార్స్ కూడా ఫేస్ బుక్ దగ్గర నుండి ఇన్ స్టా, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం తెగ తాపత్రయపడి పోతూ ఉంటారు.

ఫాలోవర్స్ పెద్దగా రాకపోతే.. అది తమ స్టార్ డమ్ కే అవమానం అని వారి భావిస్తారు. అందుకే ఫాలోయింగ్ లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తున్నారంటే.. సోషల్ మీడియా ప్రభావం అర్ధం చేసుకోవచ్చు. ఇక హీరోయిన్ శ్రద్ధ కపూర్ కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

సోషల్ మీడియాలో అత్యధిక పాపులారిటీ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ లలో శ్రద్ధకపూర్ ఒకరు కావడం విశేషం. ఈ భామ ఇప్పుడు ఏకంగా 60 మిలియన్ల ఫాలోవర్స్ ని పొందింది. ప్రియాంక చోప్రాకి మాత్రం 62 మిలియన్ల ఫాలోవర్స్ అనుకోండి. ఏ హీరోయిన్ కి ఎంత ఫాలోయింగ్?

ప్రియాంక చోప్రా – 62 మిలియన్లు
శ్రద్ధ కపూర్ – 60 మిలియన్లు
దీపిక పదుకోన్ – 55 మిలియన్లు
ఆలియా భట్ – 52 మిలియన్లు
కత్రినా కైఫ్ – 48 మిలియన్లు
సన్నీ లియోన్ – 46 మిలియన్లు
దిశా పటాని – 43 మిలియన్లు

View this post on Instagram

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

Back to top button