అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమా

బుల్లెట్‌ నడపబోయి.. బోల్తా పడ్డ నాని హీరోయిన్‌


మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. రాని పని ట్రై చేయకూడదు. ఓ తెలుగు సినిమా డైలగ్‌ ఇది. నాని సూపర్ హిట్‌ మూవీ ‘జెర్సీ’లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ ఇప్పుడు ఇదే డైలాగ్‌ చెబుతోంది. ఎందుకంటే రాని పని ట్రై చేస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఆమెకు అర్థమైంది. శ్రద్ధా తాజా మూవీ ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ గురువారమే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంలో దగ్గుబాటి రానా సమర్పించిన ఈ మూవీకి రవికాంత్ పేరూరు దర్శకత్వం వహించారు. సిద్దూ జొన్నలగడ్డ హీరో. శ్రద్ధతో పాటు సీరత్ కపూర్, శాలినీ కూడా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతున్నప్పుడే శ్రద్ధకు పై డైలాగ్‌ అర్థం తెలిసింది. తాను రాకపోయినా బుల్లెట్‌ నడిపే ప్రయత్నం చేసిన శ్రద్ధ కిందపడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెకు దెబ్బలేమీ తగల్లేదు. కానీ, ఈ ఘటన వల్ల తనకు ఓ విషయం బోధపడిందని శ్రద్ధ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. బైక్‌ నుంచి కింద పడిన వీడియోను షేర్ చేసింది.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

‘ఇండియన్‌ ఫిల్మ్‌ లో బోల్డ్‌ ఫీమేల్‌ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆమె బైక్‌ నడిపే సీన్‌ లేని సినిమాను ఊహించుకోగలమా. జూన్ 2017లో హైదరాబాద్ లోని నంది హిల్స్ లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రాత్రి వర్షం పడడంతో ఆ రోజు రోడ్డు తడిగా ఉన్నాయి. షూటింగ్ లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా అని అడిగారు. దానికి నేను.. రాదు కానీ.. ట్రై చేస్తా అన్నాను. ఎందుకంటే నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉంది. గెర్లు ఎలా వేయాలి, ఎలా ముందుకెళ్లాలి అని కొంచె అవగాహన ఉంది. అయినా చాన్నాళ్ల తర్వాత నేను మళ్లీ బైక్‌ ఎక్కా. అయినా నాకు భయం వేయలేదు. నేను రైడ్‌ చేయగలనని అనుకున్నా. పైగా, నా వల్ల షూటింగ్‌ కాంప్రమైజ్‌ కాకూదని భావించా. కానీ, రాయల్ ఎన్ ఫీల్డ్ ఎక్కి అలా టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ తప్పి కిందపడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. నేను కిందపడగానే సెట్ లో ఉన్నవాళ్లంతా తెగ భయపడ్డారు. నా దగ్గరికి వచ్చి హెల్ప్‌ చేశారు. కానీ, బైక్‌కు ఏవైనా స్క్రేచ్స్ పడ్డాయా అనే ఎక్కువగా కంగారు పడ్డారు. అయినా ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌ ఎందుకంత బరువుగా ఉంటుందబ్బా..?’ అని ప్రశ్నిస్తూ శ్రద్ధా తన అనుభవాన్ని షేర్ చేసింది.

https://www.instagram.com/p/CBz2l4hljVU/