టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా రివ్యూస్

రివ్యూ : శుక్ర – స్లోగా సాగే బోరింగ్ థ్రిల్లర్ !

నటీనటులు – అరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు
దర్శకత్వం – సుకు పుర్వజ్
సంగీతం – ఆశీర్వాద్
రచన – సుకు పుర్వజ్
సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి
నిర్మాతలు – అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె

ఈ రోజుల్లో సినిమా చిన్నదా పెద్దదా అని చూడటం లేదు. కొత్తదనం ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటిది ఎలాంటి కొత్తదనం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘శుక్ర’. మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన ఈ సినిమా‌కి సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ :

చెప్పుకోటానికి పెద్దగా కథ ఏమి లేదు, ఉన్న కథనే ముచ్చటించుకుంటే.. విల్లీ (అరవింద్ కృష్ణ ) అనే కుర్రాడు రియా (శ్రీజితా ఘోష్ ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. విదేశాలకు వెళ్లి బిజినెస్ లో ఉన్నది అంతా పోగొట్టుకుని..వైజాగ్ కు వచ్చి కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే ఓ రోజు ఫ్రెండ్స్ అందరితో కలిసి రియా బర్త్ డే పార్టీ ప్లాన్ చేస్తారు. ఫ్రెండ్స్ అంతా వస్తారు. ఆ రాత్రి ఆ ఇంట్లో మూడు హత్యలు జరుగుతాయి. ఇంతకీ ఆ హత్యలు చేసింది ఎవరు ? మరోవైపు సిటీలో థగ్స్ గ్యాంగ్ హల్ చల్ చేస్తూ ఉంటుంది, ఆ గ్యాంగ్ కి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా ? చివరకు మర్డర్స్ కేస్ ఎలా క్లోస్ అయ్యింది. ఇంతకీ శుక్ర అనే పేరు ఎందుకు వచ్చింది ? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఒప్పిగ్గా ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

దర్శకుడు సుకు పూర్వజ్ డిఫరెంట్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే ధగ్స్ గ్యాంగ్ చేసే మర్డర్స్ ని భయంకంరగా చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు. అయినా కథలోకి తీసుకెళ్లెందుకు మంచి సీన్స్ రాసుకోవాలి గానీ, అడ్డమైన సీన్స్ ను రాసుకుంటూ పోతే స్క్రీన్ ప్లే సక్రమంగా ఉండదు. ఇక హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ లో హద్దులు దాటారు.

ఆ తరువాత పార్టీ మూడ్ నుంచి సీరియస్ మర్డర్స్ లోకి ఎంటరైన తర్వాత కథ ఊపందుకుంది అనుకుంటే.. అనవసరమైన సీన్స్ తో మళ్ళీ సినిమాని బోరింగ్ ప్లే సాగదీశారు. అయితే ఊహించని ట్విస్ట్ వల్ల సెకండాఫ్ పై క్యూరియాసిటీ పెరిగింది. ఇక శుక్ర అనే టైటిల్ కు కథకు సంబంధం ఏంటో అప్పుడే అర్థమవుతుంది. అలాగే పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో కథలో స్పీడ్ పెరిగింది.

ఇక హీరోగా అరవింద్ కృష్ణ ఈ కథకు మంచి ఛాయిస్ అనిపించుకున్నాడు. రిచ్ బిజినెస్ మేన్ గా సరిగ్గా సరిపోయాడు. మర్డర్స్ జరిగిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో అతని నటన చాల బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ శ్రీజితా హాట్ గా కనిపించి బాగానే అలరించింది. ముఖ్యంగా హీరోతో మంచి రొమాంటిక్ సీన్స్ తో రెచ్చగొట్టింది. హీరో ఫ్రెండ్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వారు సైతం కథకు తగ్గట్టుగా సరిగ్గా సరిపోయారు.

ప్లస్ పాయింట్స్ :

నటీనటులు నటన,
సంగీతం,
రొమాంటిక్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

బోరింగ్ ప్లే,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు కనిపించకపోవడం

తీర్పు :

భిన్నమైన సినిమా అంటూ వచ్చిన ‘శుక్ర’ చిత్రం వైవిధ్యంగా లేకపోగా నాసిరకమైన సీన్స్ తో, బాధ పెట్టే బోరింగ్ ప్లేతో మొత్తానికి విసిగించింది. అసలు గ్రిప్పింగ్ నరేషన్ తో కథ చెప్పాల్సిన దర్శకుడు అర్ధం పర్ధం లేని సీన్స్ ను చూపిస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపించాడు. ఈ కరోనా సమయంలో ఇలాంటి చెత్త సినిమాలు చూడకపోవడమే మంచింది.

రేటింగ్ – 1.5

Back to top button