బాలీవుడ్సినిమా

భర్తతో విడాకులు.. వ్యభిచారిణి పాత్రలో హీరోయిన్ !

Shweta Basu
‘కొత్త బంగారు లోకం’ అంటూ తెలుగులో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరైన ‘శ్వేతబసు ప్రసాద్’కు పాపం బంగారం లాంటి భవిష్యత్తు లేకుండా పోయింది. చిన్న వయసులోనే స్టార్‌ డమ్ వచ్చినా ఎన్నో ఎదురుదెబ్బలు.. దీనికి తోడు ఆర్థిక పరమైన కష్టాలు మొత్తానికి చీకటి ప్రపంచంలో అడుగు పెట్టిన బాగోతం.. చివరకు వ్యభిచారం నుండి బయటపడి రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, అతనితో విభేదాలు చోటుచేసుకోవడంతో అతనికి దూరం అయింది. తన వైవాహిక జీవితంలో చేదు సంఘటనల గురించి తాజాగా చెప్పుకొచ్చింది శ్వేత.

Also Read: విభిన్నమైన పాత్రలో అక్కినేని హీరో !

తన విడాకుల గురించి తన భర్తతో చోటు చేసుకొన్న ఇబ్బందుల గురించి ట్విట్టర్ ‌లో స్పందిస్తూ.. ‘నేను డిప్రెషన్ ‌లో ఉన్న సమయంలో అతను నా జీవితంలోకి వచ్చి.. నన్ను ప్రేమిస్తునట్లు నమ్మించాడు. నేను కూడా అతన్ని ప్రేమించాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా. కానీ పెళ్లి బ్రేకప్ చకచకా జరిగిపోయాయి. అయితే విడిపోయిన తర్వాత మాత్రం నేను నా లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు స్వేచ్చ లభించినట్లుంది. నేనే స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను’ అంటూ తన ఆనందాన్ని తెలిపింది శ్వేతా బసు ప్రసాద్.

Also Read: ‘ఉప్పెన’ విరుచుకుపడుతుందా?

కాగా ఇప్పటికీ టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో అలరిస్తున్న శ్వేతాబసు ప్రసాద్‌ త్వరలో ఓ బోల్డ్ సినిమాలో నటించబోతుంది. శ్వేతా ప్రస్తుతం తానూ చేస్తోన్న సినిమా గురించి కూడా చెబుతూ.. ‘ప్రస్తుతం నేను ఇండియా లాక్‌డౌన్ అనే బోల్డ్ సినిమాలో నటిస్తున్నా. ఇందులో వ్యభిచారిణి పాత్రలో కనిపించబోతున్నాను. యాక్టర్‌గా రాణించాలంటే ఇలాంటి క్లిష్టమైన పాత్రలనే చేయాలనేది నా అభిప్రాయం. అందుకే దీనిలో ఒదిగిపోవాలనే ఉద్దేశ్యంతో రెడ్ లైట్ ఏరియాలోకి కూడా వెళ్లొచ్చాను. వాళ్ల కష్టాలను దగ్గరుండి మరీ చూశాను’ అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button