అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం బయటపెట్టిన సింగర్ సునిత..!

Pradeep Marriage Date

బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ల డ్యామినేషన్ ఉన్న సమయంలో మేల్ యాంకర్లు కూడా ఈ రంగంలో రాణించవచ్చని ప్రదీప్ మాచిరాజు నిరూపించాడు. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ అవతారం ఎత్తి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. యాంకర్ గానే చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

Also Read: మూవీ రివ్యూ: ‘అన‌గ‌న‌గా ఓ అతిథి’.. హిట్టా? ఫ్లాపా?

యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయం బుల్లితెరపై ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. పెళ్లీడు దాటిపోయిన ప్రదీప్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. ఏదైనా ప్రాబ్లమా? అంటూ తోటియాంకర్లు.. జడ్జిలు సైటర్స్ వేయడం కన్పిస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం యాంకర్ ప్రదీప్ ఓ అమ్మాయి దారుణమైన ఆరోపణలు చేయడంతో అతడి క్యారెక్టర్ పై పలు అనుమానాలు రేకెత్తాయి.

తాజాగా సింగర్ సునీత్ యాంకర్ ప్రదీప్ ను ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతోంది. ప్రదీప్ ప్రస్తుతం ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్’ అనే షో చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈనేపథ్యంలోనే ఆమె యాంకర్ ప్రదీప్‌ను ఉద్దేశించి.. ఇక్కడ ఏదో ట్రాక్ నడుస్తున్నట్లు తెలిసిందంటూ సెటైర్ వేసింది.

ఆమె అలా అనగానే కెమెరాలన్నీ హరిక నారాయణ వైపు చూపించాయి. దీంతో ప్రదీప్-హరికల మధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందనే క్లారిటీ వచ్చేసింది. గతంలోనే యాంకర్ ప్రదీప్ హరికపై రోమాంటిక్ కామెంట్స్ చేయడంతో సునిత ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది.

Also Read: బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?

ఈ విషయంలోనే యాంకర్ రవి కూడా పలుసార్లు ప్రదీప్ పై సైటర్స్ వేయడం కన్పించింది. ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్’లో హారిక నారాయణ్ మెంటర్‌గా చేస్తోంది. ప్రదీప్ లవ్ ట్రాక్ గమ్యానికి చేరుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే..!

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button