వ్యాపారము

కేవలం రూ.165తో కోటీశ్వరులయ్యే ఛాన్స్.. ఐసీఐసీఐ సూపర్ స్కీమ్..?

తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం రాబడిని పొందాలని మనలో చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎంతో శ్రమించి తమ కలలను నిజం చేసుకుంటే మరి కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా జీవితంలో కోటీశ్వరులు కావడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సులభంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశాలు ఉంటాయని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం రాబడిని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రోజుకు 165 రూపాయల చొప్పున ఆదా చేసి నెలకు 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ మొత్తంతోనే ఎక్కువ రాబడిని పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

నెలకు 5,000 రూపాయల చొప్పున 25 సంవత్సరాల పాటు సిప్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత ఏకంగా 1.6 కోట్ల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. 15 శాతం రాబడిని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం వస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ ఐదు సంవత్సరాల రాబడి 26 శాతంగా ఉండగా ఇందులో కనీసం 100 రూపాయల నుంచి సులభంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

ఎస్‌బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీ ఫండ్ లో కనీసం 500 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా ఈ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా 22 శాతం రాబడిని పొందే అవకాశాలు ఉంటాయని సమాచారం.

Back to top button