అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలు

పవన్ తో సోము వీర్రాజు భేటి.. ‘తిరుపతి’ సీటు కొలిక్కేనా?

Somu Veerraju meets Pawan .. Will he win the ‘Tirupati’ seat?

ఇటీవల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలోని బీజేపీతో తమకు మంచి సంబంధాలున్నాయని.. కానీ రాష్ట్రంలోని బీజేపీతోనే లేవని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పవన్ కళ్యాణ్ కు పడడం లేదన్న టాక్ బయటకు వచ్చింది.

దీంతో ఏమనుకున్నాడో ఏమో కానీ సడెన్ గా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికే ఈ భేటి జరిగిందని తెలుస్తోంది.

ప్రధానంగా వీరిద్దరి భేటి తిరుపతి ఎంపీ అభ్యర్ధి.. ఏపీలో రాజకీయ పరిస్థితుల పై జరిగిందని తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధి పై చర్చించినట్టు తెలిసింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధి గా బరిలో దిగుతామని ఇద్దరు నేతలు డిసైడ్ అయినట్టు సమాచారం..

బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదని.. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామని సోము వీర్రాజు తెలిపారు. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం అని ఆయన ప్రకటించారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామన్నారు.

ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించినట్టు తెలుస్తోంది. కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని ఇద్దరు నేతలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

జనసేనాని ఇటీవల తిరుపతి పర్యటనలో బీజేపీతో పొత్తు కుదరట్లేదన్న వ్యాఖ్యల నేపథ్యంలో సోము వీర్రాజు ఆయనను ఒప్పించేందుకు కలిసినట్టు తెలుస్తోంది. ఉమ్మడిగా పోటీచేయాలని బీజేపీ పవన్ ను ఒప్పించినట్టు సమాచారం. అయితే ఏ పార్టీకి ఈ తిరుపతి సీటు అనేది ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.

2024 ఎన్నికలే లక్ష్యంగా వీరి భేటి సాగుతున్న బీజేపీ కన్నా ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న పవన్ ఇప్పుడు బీజేపీకి సీట్లు వదిలేస్తాడా? కాంప్రమైజ్ అవుతాడా అన్నది చూడాలి.

Back to top button