జాతీయంరాజకీయాలు

సోనూ సూద్ మళ్లీ ఆశ్చర్యపరిచాడు..

కరోనా లాక్ డౌన్ వేళ ఎంతో మందిని ఆదుకొని రియల్ హీరో అయ్యాడు సోనూ సూద్. ఎంతో మంది వలస కూలీలు, మధ్యతరగతి వారికి సాయం చేశాడు. అందరినీ సొంత ఖర్చుతో ఇళ్లకు పంపాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ లోనూ సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అందరికీ ‘ఊపిరి’పోశాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేసే సోనూసూద్ తాజాగా వీధి వ్యాపారులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. మొన్నీ మధ్య వీధుల్లో చపాతీలు తయారు చేస్తూ, జ్యూస్ చిలుకుతూ వారిని ప్రోత్సహించాలని.. తాగాలని సూచించాడు.

తాజాగా కశ్మీర్ వెళ్లిన సోనూ సూద్ అక్కడ వీధి వ్యాపారులకు మద్దతుగా నిలిచాడు. వీధిలో చెప్పులు అమ్ముతున్న అతడి వద్దకు వెళ్లి చెప్పులు కొన్నాడు. సోనూసూద్ చెబుతున్నాడు ఇక్కడ 20శాతం డిస్కౌంట్ లభిస్తుంది అందరూ కొనండని వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లిన సోనూసూద్ అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్ ఖాన్ అనే వీధి వ్యాపారి చెంతకు వెళ్లి చెప్పులు కొన్నాడు. అది కూడా బేరమాడి మరీ కొన్నాడు. ‘చెప్పులు కొనాలనుకుంటే.. షమీమ్ షాప్ వద్దకు రండి.. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా పొందండి’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వీధి వ్యాపారులకు మద్దతుగా సోనూ సూద్ చేస్తున్న ఈ కృషికి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Back to top button