టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

తెరపై గంగూలీ ఇన్నింగ్స్?

ప్రముఖ క్రికెటర్ గంగూలీ బయోపిక్ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవమెంతోగానీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్లో భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ధోని బయోపిక్ తెరపై అలరించాయి. ప్రస్తుతం బాలీవుడ్లో 1983 ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

బాలీవుడ్లో క్రీడాంశాలతో తెరకెక్కించిన మూవీలకు మంచి ఆదరణ లభిస్తుంది. హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాలతో వచ్చిన మూవీలు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి. ఇటీవలే సచిన్, ధోని జీవితాధారంగా తెరకెక్కించిన మూవీలు కూడా పర్వాలేదనిపించాయి. దీంతో ప్రస్తుత బీసీసీఐ చీఫ్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ గంగూలీ జీవితాధారంగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ రూపొందించున్నారని సమాచారం.

ఈ క్రేజీ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు నిర్మాత కరణ్ జోహర్ ప్లాన్ చేస్తున్నారు. గంగూలీ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని అనుకూలిస్తే త్వరలోనే గంగూలీ ఇన్నింగ్స్ మరోసారి తెరమీద చూడొచ్చు.