విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త.. సదరన్ రైల్వేలో ఉద్యోగాలు..?

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 191 పారామెడికల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు సదరన్ రైల్వే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీగా ఉంది. రైల్వే శాఖ ఈ నోటిఫికేషన్ ద్వారా హెమోడయాలిసిస్ టెక్నీషియన్, హాస్పిటల్ అసిస్టెంట్, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2, రేడియోగ్రాఫర్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఫిజియోథెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు చెన్నైలోని పెరంబూర్‌లో ఉన్న హెడ్ క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే కావడం గమనార్హం. https://sr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 191 ఉద్యోగ ఖాళీలలో నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 83 ఉన్నాయి.

హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 40, హాస్పిటల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 48, హెమోడయాలిసిస్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 3, ఈసీజీ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 4, ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగ ఖాళీలు 1, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగ ఖాళీలు 9, రేడియోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. 2021 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా ఈ పోస్టులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫిట్‌నెస్ ఉన్నవారికే ఈ ఉద్యోగాలకు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

Back to top button