కరోనా వైరస్టాలీవుడ్సినిమా

నిలకడగా బాలు ఆరోగ్యం.. ఎస్పీ చరణ్‌ అప్డేట్‌

బాలు ప్రస్తుతం బాగానే ఉన్నారని.. 15 నుంచి 20 నిమిషాలపాటు కుర్చీలో కూర్చోగలుగుతున్నారని చెప్పారు.

SP Charan
సినీ పాటల లెజెండరీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం బాలుకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఆగ‌స్టు 5 నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. ఆయనకు కరోనా రావడంతో ఆయన అభిమానలోకం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చివరకు బాలు త‌న 51వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఆసుప‌త్రిలోనే క‌లిసి చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

Also Read: అదిరిపోయే ‘పాట’ పాడుతున్న మహేష్?

ఆగస్టు మొదటి వారంలో హాస్పిటల్‌లో జాయిన్‌ ఎస్పీ బాలు ఆరోగ్యం మొదట్లో బాగానే ఉన్నా తర్వాత పరిస్థితి విషమించింది. డాక్టర్ల కృషితో ఎట్టకేలకు కోలుకోవడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన తనయుడు చరణ్ అప్డేట్ చేసేవారు.

Also Read: ప్లీజ్.. ఒక్క పీరియాడిక్ మూవీ చేయు మహేష్‌

అలా లేటెస్ట్‌గా ఇచ్చిన అప్డేట్ ప్రకారం బాలు ప్రస్తుతం బాగానే ఉన్నారని.. 15 నుంచి 20 నిమిషాలపాటు కుర్చీలో కూర్చోగలుగుతున్నారని చెప్పారు. అంతేకాకుండా ఆహారం కూడా తీసుకుంటున్నారని, ఫిజియో థెరపీకి కూడా బాగా స్పందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉందంటూ పాజిటివ్ వార్తను ఆయన అభిమానులకు అందించారు.

Back to top button