టాలీవుడ్బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్తూ మీడియాకి దొరికిన మహేష్ హీరోయిన్

Kiara Advani
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమా “భరత్ అను నేను” లాంటి హిట్ మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ తర్వాత… రామ్ చ‌ర‌ణ్ సరసన ‘విన‌య విధేయ రామ’లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ మాత్రమే చేస్తూ అక్కడ టాప్ ప్లేస్ కి చేరేందుకు ప్రయత్నం చేస్తుంది.

Also Read: బాలకృష్ణ, రవితేజల మధ్య మళ్ళీ పోటీ !

అమ్మడు బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో పడ్డట్లు ఏడాది కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని ఊర్లన్నీ, హోటల్స్ అన్నీ తిరిగేస్తూ ప్రియుడి సాన్నిహిత్యంలో ఫుల్ గా ఎంజాయ్ చేసే పనిలో నిమగ్నమైంది. గతేడాది చివర్లో ఈ జంట 2020కి గుడ్‌బాయ్‌ చెప్పేందుకు మాల్దీవులకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కడంతో ఆ న్యూస్ బి-టౌన్ లో వైరల్ అయ్యింది.

Also Read: వేసవిలోనే “చావు కబురు చల్లగా”

ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు ఆదివారం నాడు సిద్దార్థ్ ఇంటికి వెళుతూ మీడియా ఫోటోగ్రాఫర్లకు చిక్కింది. వారిని చూసి షాక్ అయిన కియారా ఎలాగోలా సిద్దార్థ్ ఇంటికి చేరుకొని అటునుండి అటు లంచ్ డేట్ కి వెళ్ళొచ్చారట. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియా, నెట్లో వైరల్ అవుతున్నాయి. గత ఆదివారం కూడా ఈ జంట చట్టాపట్టాలేసుకుని ముంబై లో ఒక బిగ్ హోటల్ లో కలిసారని, వీళ్లు ప్రేమ పక్షులేనంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. విష్ణువర్ధన్ దర్శకత్వం లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న “షెర్షా” చిత్రంలో కియారా అద్వానీ,సిద్ధార్థ మల్హోత్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలోనే అమ్మడు హీరో గారికి మనసిచ్చేసిందని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.

Back to top button