టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Raja Raja Chora First Day Collections : ‘రాజ రాజ చోర’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

'రాజ రాజ చోర‌'కు(Raja Raja Chora) పెద్దగా కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. మొదటి షోకే సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం మొదటి షోకి ఆశించిన స్థాయిలో లేవు.

Raja Raja Chora CollectionsRaja Raja Chora First Day Collections: యంగ్ హీరోల్లో ‘శ్రీ‌విష్ణు’ది(Sree Vushnu) ప్రత్యేక శైలి, కొత్త త‌ర‌హా క‌థ‌లు ఎంచుకోవడంలో.. తనను తానూ కొత్తగా మలుచుకోవడంలో శ్రీవిష్ణు ముందు నుంచి సక్సెస్ అవుతూనే వచ్చాడు. పైగా శ్రీ‌విష్ణు’లో ఉన్న మరో గొప్ప విషయం ఎంతోమంది కొత్త‌ద‌ర్శ‌కుల్ని ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేయడం. అలాగే వారితో వరుస విజయాలు అందుకుంటూ మొత్తానికి తనకంటూ సొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.

నిజానికి ‘రాజ రాజ చోర‌’కు(Raja Raja Chora) పెద్దగా కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. మొదటి షోకే సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం మొదటి షోకి ఆశించిన స్థాయిలో లేవు. దాంతో ఓపెనింగ్స్ బాగా రాలేదు. కానీ సినిమాకి వచ్చిన హిట్ టాక్ కారణంగా రెండో షో నుంచే కలెక్షన్స్ సునామీలా పెరిగిపోయాయి.

ఈవినింగ్ అండ్ నైట్ షోలు వచ్చే సరికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ గ్రోత్ తో దుమ్ము లేపుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్ ను పరిశీలిస్తే.. 57 లక్షల రేంజ్ లో షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక మొత్తం గ్రాస్ విషయానికి వస్తే.. ఆల్ మోస్ట్ 95 లక్షలను కలెక్ట్ చేసింది.

అలాగే ఓవర్సీస్ విషయానికి వస్తే.. దాదాపు ఈ సినిమాకి 8 లక్షల వరకు షేర్ వచ్చింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో షేర్ వచ్చింది. అలాగే 1.1 కోట్ల దాకా గ్రాస్ దక్కింది. ఈ సినిమాకి అయిన బిజినెస్ కి ఈ స్థాయి కలెక్షన్స్ కి బాగానే గిట్టుబాటు అయింది.

ఎందుకంటే… మరో వారం వరకు ఈ కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం ఉంది. ఆల్ రెడీ రెండో రోజు చాలా చోట్ల ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ‘రాజ రాజ చోర’ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Back to top button