జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

శ్రీశైలం పర్యటన: హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

Srisailam tour: Amit Shah arrives in Hyderabad

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లనున్నారు. కాసేపట్లో శ్రీశైలం స్వామివారిని దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికేందుకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ బుధవారం రాత్రి శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు.

Back to top button