విద్య / ఉద్యోగాలు

ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ.81,100 వేతనంతో..?

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 115 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హోం మంత్రిత్వ శాఖలోని సశస్త్ర సీమా బల్ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

http://www.ssbrectt.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్ అర్హతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లెవెల్ 4 పే స్కేల్ వేతనం లభిస్తుంది. 25,500 రూపాయల బేసిక్ వేతనంతో 81,100 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇఅర పరీషకల ద్వారా ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Back to top button