విద్య / ఉద్యోగాలు

పది పాసైన మహిళలకు శుభవార్త.. 69,100 రూపాయల వేతనంతో..?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిరుద్యోగ మహిళలకు అదిరిపోయే తీపికబురు అందించింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 25,271 పోస్టులు ఉండగా ఇందులో మహిళలకు ఏకంగా 2,847 పోస్టులు ఉన్నాయి. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పది పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాయడానికి అర్హులుగా ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మహిళలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష జరగగా రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌ హిందీ లేదా ఇంగ్లీష్ పై ప్రశ్నలు ఉంటాయి. ఆగష్టు 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుంది.

Back to top button