టాలీవుడ్సినిమా

లాక్డౌన్ తర్వాత స్టార్ హీరోయిన్ పెళ్లి?

nayanthara

లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లాక్డౌన్ అనంతరం నయనతార పెళ్లి చేసుకోబోతుందని కోలివుడ్లో విస్కృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ప్రేమాయణం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. శింబు-నయనతార ప్రేమాయణం.. వీరిద్దరు విడిపోవడం అప్పట్లో ఆసక్తిని రేపింది. ఆ తర్వాత కోరియోగ్రఫర్ ప్రభుదేవా-నయనతారలు ప్రేమ వ్యవహారం పెళ్లిపీఠల వరకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ వీరిద్దరు పెళ్లిపీఠలెక్కకుండానే బ్రేకప్ చెప్పేశారు.

ఆతర్వాత ముచ్చటగా మూడోసారి నయనతార ప్రేమలో పడింది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో గత కొన్నేళ్లుగా ప్రేమయాణం నడుపుతోంది. వీరిద్దరికి సంబంధించి ఫిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కావాల్సినంత ఎంటటైన్మెంట్ చేస్తుంటారు. లాక్డౌన్ అనంతరం విఘ్నేష్ శివన్-నయనతార పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. లాక్డౌన్ లేనట్లయితే ఈపాటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయేదని కోలీవుడ్లో టాక్ విన్పిస్తుంది.

ఇటీవల కాలంలో నయనతార గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. హోమ్లీ క్యారెక్టర్, లేడి ఓరియేంటెడ్ మూవీలను చేస్తూ పోతుండటంతో త్వరలోనే నయనతార పెళ్లి పీఠలెక్కనుందని వార్తకు బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వీరిద్దరు ఇంటికే పరిమితమయ్యారు. లేకుంటే ఈపాటికి ఏ విదేశాల్లో చక్కర్లు కొడుతుండేవారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం కోలివుడ్లో బహిరంగ రహస్యమే. దీంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈసారైనా నయన్ పెళ్లి పీఠలెక్కుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!