టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

‘వేశ్య’లుగా మారి గౌరవం తెచ్చిన స్టార్ హీరోయిన్స్‌!

Anushka

వేశ్యలను ఆదర్శంగా చూపించింది తెలుగు సినిమా. వేశ్యలకు ఒక మనసు ఉంటుందని, వారికి గొప్ప ప్రేమ ఉంటుందని నిరూపించింది తెలుగు సినిమా. ఈ మధ్య ఒక పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి జరిగింది. దేశ వ్యాప్తంగా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ప్రపంచ స్థాయి సినిమా గురించో.. లేక దేశ స్థాయి సినిమాల గురించో మాట్లాడుకుంటారు. కానీ, అక్కడ ఒక టాపిక్ మాత్రం బాగా చర్చకు వచ్చిందట. ఆ టాపిక్కే ‘వెండి తెర పై వేశ్య పాత్రలు’.

అయితే విచిత్రంగా ఈ టాపిక్ రాగానే అక్కడ ఉన్నవారిలో అందరూ తెలుగు సినిమా వైపు చూడటం, అది టాలీవుడ్ కే ఎంతో గౌరవం అనుకోవాలి. ఒక్క తెలుగు సినిమాలోనే ఎక్కువుగా వేశ్య పాత్రలకు గౌరవం తెచ్చారని.. వేశ్యలను కూడా సమాజంలో మార్పులు తీసుకురాగల వ్యక్తులుగా చూపించిన ఘనత కూడా తెలుగు సినిమాకే దక్కింది అని.. వేశ్య నేప‌ధ్యంలో వచ్చిన తెలుగు సినిమాల్లో ఎక్కువుగా స్ఫూర్తినిచ్చిన వేశ్య పాత్రలనే తెలుగు దర్శకరచయితలు సృష్టించారని.. అక్కడున్నవాళ్ళు అంతా ఏకగ్రీవంగాఅంగీకరించారు.

మరి తెలుగు తెరపై వెలిగిపోయిన ఆ వేశ్య పాత్రల గురించి మాట్లాడుకుంటే.. ముందుగా వేదం సినిమాలోని సరోజ పాత్ర. అనుష్క నటించిన ఈ పాత్ర చాలా మందిని ఆలోచింప‌జేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకుంటూ మనసున్న వేశ్యగా సరోజ పాత్ర మన హృదయాల్లో నిలిచిపోయింది. సుఖాన్ని పంచుతూ ఆనందాన్నిపొందుతున్న జ్యోతిలక్ష్మి అనే మహిళా.. మృగాళ్ల లాంటి మగాళ్ళతో తలపడి వారిని చిత్తుచేస్తే.. ఆ తెగువకి అడజాతే ముచ్చట పడింది జ్యోతిలక్ష్మి సినిమా చూసినప్పుడు. అలాగే ఓ వేశ్య మంత్రి అయితే సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చూపించింది పవిత్ర సినిమా.

ఇక సెగ సినిమాలో విజ్జి పాత్ర అందరి మదిలో ముద్ర పడి పోయింది. ఫ్యామిలీ హీరోయిన్‌ సంగీత ‘దానం’ సినిమాలో దైర్యవంతురాలైన వేశ్యగా నటించి ఆ పాత్రకే విలువ పెంచింది. ర‌మ్య‌కృష్ణ‌, పంచ‌తంత్రం సినిమాలో మ్యాగీగా చిలిపి వేశ్యపాత్ర‌లో నటించి.. అవసరం అయితే వేశ్య కూడా నవ్వులు పూయిస్తోంది అని నిరూపించింది. జాతీయ ఉత్త‌మ న‌టి ప్రియ‌మ‌ణి ‘మ‌న ఊరి రామాయ‌ణం’లో వేశ్య పాత్ర‌లో న‌టించి, వేశ్యలో కూడా విశాలమైన దృక్పథం, బలమైన ఆలోచన ఉంటాయని గుర్తుచేసింది. ఇక పైన ముచ్చటించుకున్న హీరోయిన్స్‌ అందరూ ‘వేశ్య’లుగా నటించి ఆ పాత్రలకి అలాగే తమకు గౌరవం తెచ్చుకున్నారు.

– శివ.కె

Back to top button