అత్యంత ప్రజాదరణవ్యాపారము

18 ఏళ్లు నిండాయా.. ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.5 వేలు..?

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉండగా ఈ స్కీమ్ ద్వారా నెలకు 5,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది.

18 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు నెలకు 210 రూపాయల చొప్పున చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత నెలకు 5,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. వయస్సు ప్రాతిపదికన చెల్లించే ప్రీమియం ఆధారంగా పెన్షన్ వస్తుంది. నెలనెలా రూ.42 నుంచి రూ.1,454 వరకు ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు నెలకు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ ను తీసుకోవచ్చు సమీపంలోని బ్యాంక్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పాపులర్ పెన్షన్ స్కీమ్ అయిన ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ద్వారానే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా బ్యాంక్ ఖాతా ద్వారానే ఈ స్కీమ్ కు డబ్బులు చెల్లించవచ్చు.

ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న స్కీమ్ లతో పోలిస్తే కేంద్రం అందిస్తున్న స్కీమ్ ల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

Back to top button