అత్యంత ప్రజాదరణవ్యాపారము

డాలర్ కంటే విలువైన కరెన్సీ ఉన్న దేశాలు ఇవే..?

సాధారణంగా మన దేశంలో ప్రజలు మన దేశ కరెన్సీ అయిన రూపాయి గురించి అమెరికా కరెన్సీ అయిన డాలర్ గురించి ఎక్కువగా విని ఉంటారు. ప్రపంచంలో 200 కంటే ఎక్కువ దేశాలు ఉండగా అంతర్జాతీయ వాణిజ్యంలో మాత్రం డాలర్ నే ప్రామాణికంగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం డాలర్ విలువ 72 రూపాయలకు అటూఇటుగా ఉండగా డాలర్ కంటే ఎక్కువ విలువున్న కరెన్సీలు ఉన్నాయి. ఆ దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాల్లో కువైట్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ దేశ కరెన్సీ దినార్ కాగా ఒక కువైట్ దినార్ 3.32 యూఎస్ డాలర్లతో సమానం కావడం గమనార్హం. మన దేశ కరెన్సీ ప్రకారం ఒక దినార్ విలువ 239.91 రూపాయలుగా ఉంది. 100 దీవులతో కూడిన దీవి అయిన బహ్రెయిన్ కూడా పెట్రోలియంను ఎగుమతి చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటోంది. ఒక బహ్రెయిని దినార్ విలువ 2.65 డాలర్లు కాగా బహ్రెయినీ దినార్ రూపాయి మారకం విలువ 192.27 రూపాయలుగా ఉంది.

అమెరికా సముద్ర తీరాన ఉన్న దేశమైన ఒమన్ లో పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేశ కరెన్సీని ఒమన్ రియల్ పేరుతో పిలుస్తారు. ఒక్క ఒమన్ రియల్ 2.60 డాలర్లతో సమానం కాగా ఒమన్ రియల్ రూపాయి మారకం విలువ 188.29 రూపాయలుగా ఉంది. ఎడారి దేశమైన జోర్డాన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఆర్హిక వ్యవస్థను బలపరచుకుంటోంది. ఒక్క జోర్దానియన్ దినార్ 1.41 డాలర్లతో సమానం కాగా రూపాయి మారకం విలువ 102.25 రూపాయలుగా ఉంది.

ఐరోపాలో బలమైన రాజ్యంగా పేరు తెచ్చుకున్న యూకె దేశ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ఈ కరెన్సీతో పోలిస్తే రూపాయి మారకం విలువ 100.38 రూపాయలుగా ఉంది. ఒక పౌండ్ స్టెర్లింగ్ 1.38 డాలర్లతో సమానం కావడం గమనార్హం.

Back to top button