టాలీవుడ్సినిమా

బ్ర‌హ్మానందంపై సుడిగాలి కామెంట్స్‌..

Sudigali Sudheer
వెండి తెరపై బ్రహ్మానందం మెరుపులు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అనేది ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఒక దశలో తెలుగు సినిమాలో బ్రహ్మానందం వాంటెడ్. ఆయన సినిమాలో ఉన్నాడంటే.. అది విజయం సాధించడానికి మెజారిటీ ఛాన్సెస్ ఉంటాయన్న లెక్క‌లో ఉండేవారు మేకర్స్. అందుకే.. రచయితలు స్పెషల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవారు బ్రహ్మీ కోసం.

Also Read: సక్సెస్ కోసం రొమాన్సే బెటర్ !

అయితే.. కాలక్రమంలో ఆయ‌న వెండి తెర‌కు దూర‌మ‌య్యారు. వ‌య‌సుతోపాటు అనారోగ్యం కారణంగా ఆయ‌న సినిమాల‌ను ప‌క్క‌న బెట్టారు. మ‌ధ్య‌లో ఒక‌టీ అరా సినిమాల్లో క‌నిపించినా.. పూర్తిస్థాయిలో తిరిగి సినిమాల్లోకి రాలేదు బ్ర‌హ్మీ.

అయితే.. బ్ర‌హ్మానందం సినిమాల‌కు దూరమయ్యాడే త‌ప్ప‌, ప్రేక్ష‌కుల‌కు కాదంటే చాలా మంది ఆశ్చ‌ర్య‌ప‌డొచ్చు. కానీ.. ఇదే వాస్త‌వం. వెండితెర‌పై బ్ర‌హ్మానందం క‌నిపించ‌క చాలా రోజులు కావొచ్చు. కానీ.. సోష‌ల్ మీడియా ద్వా‌రా మాత్రం జ‌నాల‌కు ఎప్పుడూ ట‌చ్ లోనే ఉన్నారు బ్ర‌హ్మీ.

తాజాగా.. ఇదే విష‌యాన్ని జ‌బర్ద‌స్త్ క‌మెడియ‌న్ సుడిగాలి సుదీర్ మ‌రోసారి గుర్తు చేశారు. అకేష‌న్ ఏంట‌న్న‌ది తెలియ‌లేదుగానీ.. బ్ర‌హ్మీ మీమ్స్ గురించి మాట్లాడాడు. ప్ర‌తిరోజూ తాను ర‌క‌ర‌కాల మీమ్స్ చూస్తుంటాన‌నీ.. కానీ, బ్ర‌హ్మానందం మీమ్స్ చూడ‌కుండా రోజు ముగిసింది లేదని అన్నాడు సుధీర్.

Also Read: జాతిరత్నాలు ట్రైలర్ టాక్: గందరగోళంతో కామెడీ పంచారు

ఇంకా.. మీమ్స్ త‌యారు చేసే వారి గురించి మాట్లాడుతూ.. త‌మ క్రియేటివిటీతో మీమ్స్ త‌యారు చేస్తున్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్నాడు సుధీర్. ఇందులోనూ కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం గారిని మిస్ కాకుండా చూపిస్తున్న మీమ‌ర్స్ అంద‌రికీ థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు సుదీర్‌. అంద‌రినీ న‌వ్వించేందుకు మీమ‌ర్స్ ప‌డుతున్న శ్ర‌మ‌కు హ్యాట్సాప్ చెబుతున్నాన‌ని అన్నాడు. ప్ర‌స్తుతం ఈ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button