సినిమాసినిమా వార్తలు

రెండో పెళ్లిపై స్పందించిన సుమంత్.. సంచలన నిజం

Sumant reacting on second marriage .. sensational truth

 

Sumanth Clarification on Second Marriage

అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఆమె పేరు ‘పవిత్ర’ అని.. ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ రెండు మూడు రోజులుగా ఒక శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా అక్కినేని సుమంత్ స్పందించాడు.

హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకొని విభేదాలతో విడిపోయిన హీరో సుమంత్ ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. విడిగా సింగిల్ గానే ఉంటున్నారు. మధ్యలో సినిమాలు తీసినా అవి పెద్దగా ఆడడం లేదు. ఈ క్రమంలోనే ‘పవిత్ర’తో సెకండ్ పెళ్లి చేసుకోబోతున్నాడని అందరూ భావించారు.

కానీ తాజాగా సుమంత్ ట్విస్ట్ ఇచ్చాడు. నా రెండో పెళ్లి లేదు బొందా లేదు అంటూ స్పష్టం చేశాడు. అదంతా తన కొత్త సినిమా కోసం తీసిన శుభలేఖ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.. ‘విడాకులు తీసుకోవడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ‘మళ్లీ మొదలైంది’ అనే సినిమా తీస్తున్నామని.. ఆ సినిమాలోని పెళ్లి కార్డును పట్టుకొని కొందరు వైరల్ చేశారని అసలు సీక్రెట్ ను బయటపెట్టాడు. అలాంటి కథతో తెలుగులో సినిమా రాలేదని.. రెండో పెళ్లి వార్తలతో తన కొత్త సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందని సుమంత్ తెలిపారు.

ఈ సందర్భంగా విడాకుల నేపథ్యంలో సాగే ‘మళ్లీ మొదలైంది’ సినిమా ఫస్ట్ లుక్ ను సుమంత్ బయటపెట్టాడు. ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ సినిమాస్ బ్యానర్ లో కే.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

 

Back to top button