గుసగుసలుటాలీవుడ్సినిమా

మరో భామతో ఎఫైర్.. ఈ సారైనా పెళ్లి చేసుకుంటాడా ?

Sundeep Kishan
పెళ్లి వయసు వచ్చినా ఇంకా సింగిల్ గానే మిగిలిపోయిన కుర్ర హీరోల్లో ‘సందీప్ కిషన్’ ఒకడు. మనోడు తన కెరీర్ లో చేసిన సినిమాలకంటే కూడా, ఆయనగారు హీరోయిన్స్ తో సాగించిన ఎఫైర్సే ఎక్కువగా ఉన్నాయనేది సినీ జనం రెగ్యులర్ గా చెప్పుకునే మాట. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఈ విషయం పై అనేక రకాలుగా రూమర్స్ కూడా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలువురు హీరోయిన్స్ తో గతంలో సందీప్ లవ్ లో ఉన్నాడని.. ముఖ్యంగా ఇతగాడు రెజీనాతో ఘాటు ప్రేమాయణం సాగించాడని.. ఆ హీరోయిన్ ను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడని ఆ మధ్య బాగా వినిపించింది.

కానీ ఆ తరువాత ఏమైంది ఏమో.. రెజీనాకి దూరంగా జరిగాడు సందీప్. కొన్నాళ్ళు పాటు రకుల్ తో కూడా సన్నిహితంగా ఉన్నాడని.. అంతలో రకుల్ కి స్టార్ డమ్ రావడం.. సందీప్ కి దూరంగా జరగడం చకచకా జరిగిపోయాయి. రకుల్ మొదటి సినిమా సందీప్ కిషన్ తోనే అనే విషయం తెలిసిందే. కాగా తన ప్రేమల విషయం పై ఈ హీరోని అడిగితే.. అవ్వన్నీ అవాస్తవం. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. అయినా నేను లవ్ లో ఉంటే నేనే అందరికీ చెబుతాను కదా.. ప్రేమ అనేది గొప్ప అనుభూతి, దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తన పై ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి అవి ఉట్టి పుకార్లే అంటూ సందీప్ టాపిక్ ను డైవర్ట్ చేస్తూ మెల్లగా తప్పించుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ హీరో మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే సురభి అని అంటున్నారు, కాకపోతే అందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఎప్పటి నుండో ఈ అమ్మడికి సందీప్ కి మధ్య ఘాటు ఎఫైర్ నడుస్తుందట . మరి ఈ హీరోయిన్ ను అయినా పెళ్లి చేసుకుంటాడో లేదో !

Back to top button